ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. జనాల్లో ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నుంచి సరైన సినిమాలు రావడం లేదు.అయితే కృష్ణవంశీ మాత్రం మురారి మీద అభిమానులు చూపిస్తున్న ప్రేమను చూసి మురిసిపోతోన్నాడు. సినిమాలోని విషయాలు, డీటైల్స్ అడుగుతూ ఉంటే.. వాటికి సమాధానాలు ఇస్తూ సంతోష పడుతున్నాడు. ఆ శాపం ఎప్పుడు అయిపోతుంది.. ఆ బామ్మ ఎందుకు త్యాగం చేసింది.. ఆ సీన్ ఎందుకు? ఈ సీన్ ఎందుకు? అంటూ అందరూ ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. వాటన్నంటికీ కృష్ణవంశీ తీరిగ్గా సమాధానం ఇస్తూనే వస్తున్నాడు.మహేష్ బాబు అభిమానులు మురారి సినిమాను ఎంతలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ బర్త్ డే సందర్భంగా మురారి చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా.. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం నైజాం ఏరియాలో మొదటి రోజే మూడు కోట్ల వరకు గ్రాస్ రాబ్టటింది. ఇక అన్ని ఏరియాలను కలిపేసుకుంటే.. ఈ చిత్రం ఆరేడు, కోట్ల వరకు రాబట్టింది. అలా డే వన్‌తోనే అన్ని రికార్డులు చెరిపేసింది. మురారి దెబ్బకు రీ రిలీజ్‌ల సినిమాల రికార్డులన్నీ మాయమైపోయాయి.అయితే ఇప్పుడు ‘మురారి’ సీక్వెల్ ఆలోచనలు టాలీవుడ్ చుట్టూ తిరుగుతున్నాయి. మహేష్ వారసుడు గౌతమ్ ఘట్టమనేనితో ‘మురారి’ సీక్వెల్ చేయొచ్చు కదా, అని ఓ నెటిజన్ కృష్ణవంశీని సోషల్ మీడియా ద్వారా కోరాడు. ‘అది మన చేతుల్లో లేదు, మహేష్, నమ్రతలే ఆ నిర్ణయం తీసుకోవాలి’ అంటూ కృష్ణవంశీ సమాధానం చెప్పారు. మహేష్ బాబు కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం ‘మురారి’. నటుడిగా మహేష్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయిన సినిమా అది. కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. కృష్ణవంశీ టేకింగ్, మణిశర్మ సంగీతం, సీతారామశాస్త్రి సాహిత్యం… ఇవన్నీ కలిపి, ఈ సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.
మహేష్ తనయుడిగా గౌతమ్ ఈ సినిమా చేస్తే బాగానే ఉంటుంది. మంచి ఆలోచన కూడా. కానీ.. అది ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం అయితే కాదు. గౌతమ్ ఇప్పుడు చదువుకొంటున్నాడు. తనకు సినిమాలపై ధ్యాస ఉందో, లేదో తెలీదు. మహేష్ లా కొన్ని సినిమాలు చేసి, అనుభవం సంపాదించిన తరవాతే ‘మురారి’ లాంటి క్యారెక్టర్‌ని హ్యాండిల్ చేయగలడు. అప్పటికి కృష్ణవంశీ ఫామ్ లో ఉంటాడా అనేది పెద్ద ప్రశ్న.
తాజాగా ఓ నెటిజన్ ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మహేష్ బాబు కొడుకు గౌతమ్ డెబ్యూట్ ని మురారి సీక్వెల్ తో లేదా రీమేక్ తో ప్లాన్ చేయండి సర్ అని కృష్ణవంశీని అడిగాడు. దీనికి కృష్ణవంశీ సమాధానమిస్తూ.. అది మీరు, నేను కాదండి.. మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ డిసైడ్ చెయ్యాలి. వాళ్లనే డిసైడ్ చేయనిద్దాం అని రిప్లై ఇచ్చారు. దీంతో మహేష్, నమ్రత, గౌతమ్ ఓకే అంటే కృష్ణవంశీ మురారి సీక్వెల్ కి రెడీ గా ఉన్నట్టే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి గౌతమ్ ఏ సినిమాతో డెబ్యూట్ ఇస్తాడో చూడాలి.కృష్ణవంశీకి ‘మురారి’ సీక్వెల్ పై ఎలాంటి ఆశలూ, అంచనాలూ లేవు. వీలైతే మహేష్ తో మరో సినిమా చేస్తే బాగుంటుందన్నది ఆయన ఆలోచన. ‘మురారి’ తరవాత కృష్ణవంశీ – మహేష్ కలిసి సినిమా చేయనే లేదు. మహేష్ ఇప్పుడున్న పరిస్థితిలో కృష్ణవంశీకి అవకాశం ఇవ్వాలంటే అద్భుతమే జరగాలి. ఎప్పుడూ రియాలిటీకి దగ్గరగా ఉండే కృష్ణవంశీకీ ఈ విషయం తెలుసు. తన చేతిలో రెండు మూడు పెద్ద హిట్స్ ఉంటే తప్ప, పెద్ద హీరోల దృష్టి తనపై పడదు. కృష్ణవంశీ కూడా ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. ‘రంగమార్తాండ’ తరవాత ఆయన ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఇదో ప్రేమకథ. ‘చందమామ’లా రెండు మూడు జంటల కథని ఒకే సినిమాలో చూపించాలనుకొంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.