కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక భాషలో విడుదల అయిన సినిమాలను మరొక భాషలో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. అలాగే ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరొక భాషలో కూడా అద్భుతమైన విజయాలను సాధించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. ఎప్పుడు అయితే ఓ టి టి ట్రెండు విస్తృతంగా దేశంలో పెరిగిందో అప్పటి నుండి రీమిక్ సినిమాలకు పెద్దగా ప్రేక్షకుల నుండి ఆదరణ దక్కడం లేదు.
ఈ మధ్యకాలంలో ఏదైనా భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన సినిమాను హిందీలో రీమిక్ చేస్తే మాత్రం అక్కడి ప్రేక్షకులు చాలా వరకు వాటిని తిరస్కరిస్తున్నారు. కొంత కాలం క్రితం తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది ఫస్ట్ కేస్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకుంది. ఇదే సినిమాను శైలేష్ కొలను హిందీ లో హిట్ అది ఫస్ట్ కేస్ అనే పేరుతో రీమిక్ చేయగా ఆ మూవీ హిందీ లో బోల్తా కొట్టింది. అలాగే నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి "జెర్సీ" అనే మూవీ ని రూపొందించగా అది తెలుగు లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇదే సినిమాని ఇదే టైటిల్ తో హిందీ లో గౌతమ్ రీమిక్ చేయగా ఆ మూవీ కూడా హిందీలో బోల్తా కొట్టింది. ఇకపోతే కొంత కాలం క్రితం సూర్య హీరోగా సుధ కొంగర సూరారై పొట్రు అనే సినిమాను రూపొందించింది. ఈ మూవీ తెలుగులో ఆకాశమైనా హద్దురా అనే పేరుతో నేరుగా ఓ టీ టీ లో విడుదల అయింది. ఈ మూవీ కి తమిళ్ , తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈమె ఈ మూవీ ని సర్ఫరా అనే పేరుతో హిందీ లో రీమిక్ చేయగా ఈ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఈ మధ్య కాలంలో హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీమిక్ సినిమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు.