ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే టాప్ దర్శకుల స్థాయికి వెళుతూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయి ఉన్న దర్శకులలో రాజమౌళి ఒకరు. ఈయన స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఈయన సింహాద్రి , సై , చత్రపతి , విక్రమార్కుడు , యమదొంగ , మగధీర , మర్యాద రామన్న , ఈగ , బాహుబలి ది బిగినింగ్ , బాహుబలి ది కంక్లూజన్ , ఆర్ ఆర్ ఆర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ఇకపోతే రాజమౌళి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాలేదు. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏమిటి అంటే ఆయన అంతలా సక్సెస్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన సక్సెస్ కావడానికి ఒక ప్రధాన కారణం ఈయన ఏ సినిమాను అయితే చేస్తాడో దాని గురించి తప్ప పెద్దగా వేరే సినిమా గురించి పట్టించుకోడు. కొంత మంది దర్శకులు క్రేజ్ వచ్చాక ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమాను మొదలు పెట్టడం , ఒకే సారి రెండు సినిమాలను పూర్తి చేయడం ఇలా చేస్తూ ఉంటారు.
కానీ రాజమౌళి మాత్రం ఒక సినిమా స్టార్ట్ అయ్యి అది విడుదల అయ్యి దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యే వరకు వేరే సినిమా గురించి ఆలోచించాడు. ఇక మరొక సినిమా మొదలు పెడితే దాని గురించి తప్ప వేరే దాని గురించి ఆలోచించడు. అంత డెడికేషన్ గా ఉంటూ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు కాబట్టి ఆయన కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క అపజయం కూడా ఆయనకు దక్కలేదు. ఇకపోతే రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్నాడు. ఈ మూవీ మరికొన్ని నెలలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.