తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో అనిల్ రవిపూడి ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాలేదు. ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈయనకు ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఆఖరుగా అనిల్ రావిపూడి , బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమాను రూపొందించాడు ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఈయన మరియు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కమిడియన్లలో ఒకరు అయినటువంటి సప్తగిరి మంచి స్నేహితులు.
అయిన కూడా వీరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. దీని గురించి తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అనిల్ రావిపూడి తాజాగా మాట్లాడుతూ ... నేను సప్తగిరి మంచి స్నేహితులం. మేమిద్దరం మంచి స్నేహితులం అయినప్పటికీ నేను దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా ఆయన నటించలేదు. దానికి ప్రధాన కారణం అతనే ... ఎందుకు అంటే నాకు ఒక రోజు సప్తగిరి ఫోన్ చేసి సినిమాలో నాకు ఏదైనా పాత్ర రాస్తున్నావా ... రాస్తే చిన్న పాత్ర మాత్రం అస్సలు రాయకు. సినిమా మొత్తం నేను ఉండాలి.
అలాంటి పాత్ర ఏదైనా రాస్తే చెప్పు నేను చేస్తాను అని అన్నాడు. ఇక సప్తగిరి అలా అన్న తర్వాత నేను చిన్న పాత్రలలో ఎలా తీసుకుంటాను. ఇక పెద్ద పాత్ర ఇప్పటివరకు దొరకలేదు. అందుకే సప్తగిరి నేను దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా నటించలేదు అనిల్ రావిపూడి తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.