నిర్మాతగా నిహారిక హిట్టా? ఫట్టా?.. నెటిజెన్ల రియాక్షన్ ఇదే..!

frame నిర్మాతగా నిహారిక హిట్టా? ఫట్టా?.. నెటిజెన్ల రియాక్షన్ ఇదే..!

lakhmi saranya
నూతన నటీనాటులతో నాగబాబు కూతురు నిహారిక నిర్మించిన తాజా చిత్రం కమిటీ కుర్రాళ్ళు. యదు వంశీ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అయ్యాడు . ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో జరిగే భరింకాళమ్మ  తల్లి జాతర చుట్టూ అల్లుకున్న కథ ఇది .

జాతరలో స్నేహితుల మధ్య జరిగే గొడవలు.. ఆ గొడవపల్ల ఓ స్నేహితుడు చనిపోవడం అండ్ స్నేహితులు విడిపోవడం ఆ తరువాత వచ్చే జాతర కోసం కలుసుకోవడం మరియు అక్కడ ఊళ్లో రాజకీయాలు మరియు స్నేహితుల మధ్య భావుద్వేగా సన్నివేశాలు.. చిన్నప్పటి వారి ఆటపాటలు అండ్ మధుర అనుభూతులు నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. అయితే స్టోరీ కొత్తగా లేకపోయినప్పటికీ ఇటువంటి చిత్రంలో ఏమాత్రం స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ చూపించిన ఎమోషనల్ గా ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ చేయించిన సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది. అయితే కమిటీ కుర్రాళ్ళు సినిమాలో జాతర హడావిడి స్నేహితుల మధ్య కొన్ని ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు ఇలా అన్ని ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి.

కాకపోతే ఎమోషనల్ అనేది చిత్రాల మధ్య క్యారీ కాకపోవడం వల్ల సినిమా అంతా సూపర్ హిట్ అనిపించుకోలేకపోయింది. తొలి భాగం సరదా సరదాగా గడిచినా సెకండ్ హాఫ్ మాత్రం సగతిత సన్నివేశాలతో కాస్త బోర్ కొట్టిస్తుంది. ఓకే సినిమాలో స్నేహం ఎన్నికలు రిలేషన్స్ ఇలా మూడు పాయింట్స్ టచ్ చేయాలి అని చూసినా డైరెక్టర్ దేనికి సరైన న్యాయం చేయలేదని టాక్ వినిపిస్తుంది . ముఖ్యంగా పతాక సన్నివేశాలు పెద్దగా ఆసక్తికరంగా కనిపించలేదట. సినిమా ఇదే పెద్ద మైనస్ అని టాక్ . అసలు సరైన ముగింపు లేదంటూ సినిమాను ఎం చేయడం బాలేదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు . ఏదేమైనప్పటికీ కమిటీ కుర్రాళ్ళు చిత్రంతో నిర్మాతగా విహారిక కొంత హిట్ అయినప్పటికీ మరి కొంత ఫ్లాప్ అయింది అని చెప్పుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: