కళ్ళు అదరడానికి కారణమేంటో తెలుసా..?

frame కళ్ళు అదరడానికి కారణమేంటో తెలుసా..?

lakhmi saranya
చాలామందికి కళ్ళు అదురుతూ ఉంటాయి ‌. ఇలా అదిరినప్పుడు పెద్దవారు అనేక విధాలుగా చెబుతూ ఉంటారు . కొందరు మంచి అనే మరికొందరు చెడ్డ అని చెబుతూ ఉంటారు . చాలామందికి కుడి కన్ను లేదా ఎడమ కన్ను అప్పుడప్పుడు అదురుతుంది ‌ . కుడికొన్ను అదిరితే మంచిదని .. ఎడమ కన్ను అదిరితే చెడు అని పెద్దవారు సూచిస్తూ ఉంటారు . కానీ ..కంటి సంబంధిత సమస్యలు ఉంటే కళ్ళు అదురుతాయని నిపుణులు చెబుతున్నారు . మెదడు లేదా నరాల లోపంతో అదురుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు . చాలా మందిలో అధిక ఒత్తిడితో ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు .

ఎక్కువ సేపు టీవీ అండ్ మొబైల్ లేదా కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ చూసినా .. కళ్ళు ఒత్తిడికి గురవుతాయి . శరీరానికి తగినంత నిద్ర లేకపోయినప్పటికీ ఈ సమస్య ఎదురవుతుంది . కన్ను పదే పదే కుదురుతుంటే వెంటనే వైద్యులని సంప్రదించడం ఉత్తమం . సాధారణంగా తీసుకుని వదిలేయడం ద్వారా అనంతరం అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది . అందువల్ల ఏ సమస్యని కూడా అంతా ఈజీగా తీసుకోకూడదు . అలా తీసుకోవడం ద్వారా .. కంటి చూపుకే ప్రమాదం .

ప్రజెంట్ ఉన్న జనరేషన్ గారికి అనేక అనారోగ్య సమస్యలు పెట్టేస్తున్నాయి . పూర్వకాలంలో 40 ఏళ్ల వయసు వారికి వచ్చే సమస్యలు ప్రజెంట్ జనరేషన్ లో 20 ఏళ్లకే దరి చేరుతున్నాయి . దీని అంతటికి ప్రధాన కారణం తినే ఆహారం . తినే ఆహారం సరిగ్గా లేకపోవడం కారణంగా ఈ సమస్యలు చిన్న వయసులోనే ఎదుర్కోవాల్సి వస్తుంది . ఇటువంటి సమస్యలను నివారించాలంటే మన డైలీ రొటీన్ ని మంచి ఆహారంతో నిండేలా చూసుకోవాలి . ఇలా చూసుకోవడం ద్వారా ఎటువంటి సమస్యలు బారిన పడాల్సిన పని ఉండదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: