జాతర్ల పై ఆధారపడుతున్న జూనియర్ అల్లు అర్జున్ !

Seetha Sailaja

ఈ సంవత్సరం విడుదల కాబోతున్న రెండు భారీ సినిమాల పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలు ‘దేవర’ ‘పుష్ప 2’ ఈ రెండు సినిమాల ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ కోసం జూనియర్ అల్లు అర్జున్ లు ఒకరి పై ఒకరు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలలోను జాతర ఎపిసోడ్ హైలెట్ గా ఉంటుందని ప్రచారాం జరుగుతోంది.

దసరా పండుగ ఇంకా రాకుండానే ఆ పండుగను టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న ‘దేవర’ మూవీలో ఒక మాస్ జాతర పాట ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ పాట కోసం గోవా బీచ్ దగ్గర ఒక జాతర సెట్ వేసి ఈ పాటను వందలాది మంది ఆర్టిస్టుల మధ్య చిత్రీకరించారని తెలుస్తోంది. ఈపాటలో తారక్ వేసే స్టెప్ లతో ధియేటర్లు దద్దరిల్లిపోతాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

సంగీతదర్శకుడు అనిరుద్ ఈపాటకు ఇచ్చిన మాస్ ట్యూన్ విపరీతంగా జనంలోకి వెళ్ళిపోతుందని అంటున్నారు. అదేవిధంగా డిసెంబర్ 6న విడుదలకాబోతున్న ‘పుష్ప 2’ మూవీలో కూడఒక జాతర సాంగ్ ఉంటుంది అన్న లీకులు వస్తున్నాయి. ఈ జాతర సీన్ లో అల్లుఅర్జున్ చీర కట్టుకుని వేసే స్టెప్స్ ‘పుష్ప 2’ మూవీని మరో రేంజ్ కి తీసుకువెళ్ళిపోతుందని అంటున్నారు. సినిమా ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ సీన్ తో ఈమూవీ ఫస్ట్ ఆఫ్ పూర్తి అయి ఇంటర్వెల్ తరువాత రాబోయే ట్విస్ట్ ల కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా ఈ సీన్ దర్శకుడు సుకుమార్ ఘాట్ చేసినట్లు లీక్ లు వస్తున్నాయి.

ఇప్పటికే ఈసినిమాలోని అల్లు ఆర్జన్ లేడీ గెటప్ హైలెట్ కావడంతో ఈమూవీ విడుదల కోసం బన్నీ అభిమానులు చాల ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల పై భారీ అంచనాలు ఉండటంతో ఈ రెండు సినిమాల బిజినెస్ కూడ అంచనాలను మించి జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: