షాకింగ్ వీడియో షేర్ చేసిన వేణు స్వామి.. అందులో అతను చెప్పిన మాటలు వింటే..?

Suma Kallamadi
రీసెంట్‌గా టాలీవుడ్ హీరో నాగ చైతన్య, బాలీవుడ్ యాక్ట్రెస్ శోభిత ధూళిపాళల ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ సమక్షంలో జరిగింది. ఆ తర్వాత నాగార్జున ఈ గుడ్ న్యూస్ ప్రకటించారు. నాగ చైతన్య ఇంతకుముందు సమంతను పెళ్లి చేసుకున్నాడు. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. వీళ్లు విడిపోతారని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ముందే జోష్యం చెప్పి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు. మళ్లీ ఇప్పుడు ఆయన నాగచైతన్య మ్యారీడ్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

చైతూ, శోభిత మూడేళ్ల తర్వాత విడిపోతారని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు. అంతేకాదు ఆయన ఒక కేసు కూడా ఫైల్ అయింది. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఒక రూమ్ వేణు స్వామి పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పర్సనల్ లైఫ్ గురించి బయటకు ఆయన కామెంట్ చేసే రైట్ లేదు. పెళ్లి, విడాకులు అనేది ఒకరి వ్యక్తిగత విషయాలు దాని గురించి చేసేలాగా మాట్లాడే హక్కు ఒకరికి లేదు అనేది అక్కినేని ఫ్యామిలీ మెంబర్ చెబుతున్న మాట.

మరోవైపు వేణు స్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ ‘నేను సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఆస్ట్రాలజీలను విశ్లేషించను. ఇంతకుముందు నాగ చైతన్య-సమంతల మ్యారేజ్ లైఫ్ గురించి ఒక జోష్యం చెప్పాను. అది నిజమైంది. ఇప్పుడు కూడా ప్రజలకు వారి గురించి ఒక నిజం చెప్పాలనుకున్నాను. అందుకే శోభిత-నాగ చైతన్య జాతకాలను విశ్లేషించాను. కానీ ఇక నుంచి సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల జాతకాల గురించి ఎప్పుడు జోష్యాలు చెప్పను" అని వెల్లడించారు.

మరోవైపు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నాగ చైతన్య, శోభిత వివాహ జీవితం గురించి జోష్యం చెప్పడం ఏం బాగోలేదని చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంతేకాదు వేణు స్వామికి ఫోన్ చేసి "ఏంటి స్వామి అని వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీరు విడిపోతారని చెప్తున్నారు" అని కొద్దిగా కోపంగా కూడా మాట్లాడాడట. ఈ విషయాన్ని స్వయంగా వేణు స్వామే తెలిపారు. అయితే వేణు స్వామి తాను చేసింది తప్పేనని ఒప్పుకుంటూ ఇకపై ప్రముఖుల జాతకాలు చెప్పేది లేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మొత్తం మీద చెడు జరుగుతుందని చెప్పడం ద్వారా ఆయన పైన నెగటివిటీ పెరిగిపోతోంది. వ్యక్తులకు మంచి జరుగుతుందని చెప్తే అది జరిగినా జరగకపోయినా ఏమీ అనరు చెడు జరుగుతుంది అని చెప్తేనే కొందరికి కోపం వస్తుంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: