వావ్.. నాని డైరెక్టర్ నుంచి ఇలాంటి వేరియేషన్ అస్సలు ఊహించలేదుగా..?

murali krishna
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ నెల 29న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. నాని మాస్ హీరో కావాలని తపిస్తోన్న దానికి పరిష్కారంలా కనిపిస్తోందీ ట్రైలర్. మాస్ హీరో అవుతాడా లేదా అనేది ట్రైలరే చెప్పలేదు. బట్ దసరా తర్వాత ఆ స్థాయిలో మాసివ్ గా కనిపిస్తోంది. అలాగని దసరా వల్ల నానికి మాస్ లో ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పలేం.నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి టెర్రిఫిక్ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ అండ్ టీమ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక నాని ‘దసరా’ తరువాత ఆ రేంజ్‌లో రెచ్చిపోయి ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.పక్కా మాస్ యాక్షన కంటెంట్‌ తో ఈ సినిమాను మేకర్స్ రూపొందించారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ నాని పాత్రను ఎలివేట్ చేసిన విధానం సూపర్. ఇక క్లాస్‌గా కనిపించే నాని మాస్ అవతారం ఎత్తితే ఎలాంటి రచ్చ జరుగుతుందో మనకు ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. వారం రోజుల కోపాన్ని అనుచుకుని, శనివారం రోజున దాన్ని బయటపెట్టే తీరు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ ట్రైలర్‌లో నాని, ప్రియాంక మోహన్‌ల ట్రాక్ కూడా ఉంటుందని మనకు క్లూ ఇచ్చారు. ఇక ఎస్.జె.సూర్యతో నాని ఫేస్ టు ఫేస్ సీన్‌కి అభిమానులకు పూనకాలు తెప్పించారు. జేక్స్ బిజాయ్ సంగీతంతో పాటు బీజీఎంతో అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాడు.

వివేకాత్రేయ నాని కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం సరిపోదు శనివారం.మొదటి సినిమా "అంటే సుందరానికి" పూర్తి క్లాస్ గా ఉంటుంది. రెండోది మాత్రం భిన్నంగా యాక్షన్, ఎమోషనల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్లో తెలుస్తుంది. ఆత్రేయ నుంచి ఈ వేరియేషన్ ఊహించలేదని నానికి అదిరిపోయే రోల్ పడినట్లుగా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈసారి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర తప్పదని పోస్టులు పెడుతున్నారు.మరి ఇది ఏ కాలంలో జరిగే కథో కానీ.. ఓవరాల్ గా మాస్ హీరో అయిపోవాలన్న తాపత్రయంలో నాని చేసిన సినిమా లేదా.. తన క్లాస్ మూవీ ' అంటే సుందరానికి'ని ఫ్లాప్ చేశారనే ఆక్రోశంలో వివేక్ ఆత్రేయ చేసిన సినిమాలా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. మరి ఇంతకు మించిన ఎంగేజింగ్ కంటెంట్ సినిమాలో ఉంటే ఓకే. లేదా ఈ ట్రైలర్ ఫార్మాట్లోనే సినిమా ఉండబోతోందీ అంటే రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.ఓవరాల్‌గా ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ నాని కెరీర్‌లో బెస్ట్ ట్రైలర్ కట్‌గా నిలిచిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎందుకు ఇంత ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడో మనకు ఈ ట్రైలర్‌తో ప్రూవ్ చేశాడు. మొత్తానికి నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: