ఎక్కువ శాతం అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే సమయంలో విడుదల కావు. అలా విడుదల అయిన కూడా దాదాపు అలాంటి సినిమాల మధ్య కనీసం ఒకటి లేదా రెండు వారాల గ్యాప్ ఉండే విధంగా మేకర్స్ చూసుకుంటూ ఉంటారు. లేనట్లయితే రెండు సినిమాలకు హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో నిర్మాతలకు కాస్త దెబ్బ పడే అవకాశం ఉంటుంది. దానితో పెద్ద సినిమాలు విడుదల అయిన సమయంలో కచ్చితంగా మంచి సమయాన్ని చూసుకుంటారు. ఒక వేళ రెండు పెద్ద సినిమాలు ఒకే నెలలో విడుదల ఉంటే వాటి మధ్యల మినిమం గ్యాప్ ఉండే విధంగా చూసుకుంటారు.
ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఇదే నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ ని కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక వేళ పుష్ప పార్ట్ 2 మూవీ కి కనుక విడుదల అయిన తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే ఈ సినిమా అవలీలగా 20 రోజుల కంటే ఎక్కువగానే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది. అలా చేసినట్లు అయితే గేమ్ చేంజర్ పై దాని ఎఫెక్ట్ పడే అవకాశం చాలా వరకు ఉంటుంది. మరి పుష్ప 2 కనక భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే దానికి లాంగ్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని వల్ల గేమ్ చేంజెర్ మూవీ పై దాని ఇంపాక్ట్ చాలా వరకు పడే అవకాశాలు ఉన్నాయి.