అప్పుడు లైఫ్ సూపర్ గా ఉండేది.. ఆయన ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.. బలగం వేణు..!

MADDIBOINA AJAY KUMAR
కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించి వాటి ద్వారా పరవాలేదు అనే స్థాయి గుర్తింపు ను సంపాదించు కొని , ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో పార్టిసిపేట్ చేసి ఆ షో ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కొని , ఆ తర్వాత బలగం అనే సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడి గా తన కంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్న వేణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఇకపోతే తాజాగా వేణు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా జబర్దస్త్ మానేయడానికి గల కారణాలను వివరించాడు.


తాజాగా వేణు మాట్లాడుతూ ... కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో నటించాను. నేను నటించిన చాలా సినిమాలు పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంటున్నాయి కానీ నాకు మాత్రం అద్భుతమైన క్రేజ్ రావడం లేదు. అలాంటి సమయం లోనే ఈటీవీ వారు ప్రారంభించిన జబర్దస్త్ కామెడీ షో ఆఫర్ వచ్చింది. ఇక దానిలో అందులో చేయడం మొదలు పెట్టాను. ఆ షో సూపర్ సక్సెస్ అయింది. దానితో ఆ షో వారు కూడా ఎంత అంటే అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మేము కూడా కొంత కాలం చేశాము. డబ్బులు బాగా వస్తున్నాయి.


లైఫ్ అద్భుతంగా ముందుకు వెళుతుంది. కాకపోతే నేను ఇండస్ట్రీ కి వచ్చింది అందుకు కాదు. ఏదో సాధించాలి అని నాకు అనిపించింది. దానితో జబర్దస్త్ ద్వారా కెరియర్ సూపర్ గా ముందుకు వెళుతున్న ఆ షో మానేసి బయటకు వచ్చాను. ఆ తర్వాత బలగం అనే సినిమాను మొదలు పెట్టాను. ఆ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఆ మూవీ ద్వారా నాకు చాలా గొప్ప గుర్తింపు వచ్చింది అని తాజాగా వేణు ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: