నాకు ఆ అర్హత ఇంకా రాలేదు..శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

murali krishna
టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది క్యూట్ బ్యూటీ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ,  ఆ తర్వాత టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ గా ఎదిగింది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ తోనూ కలిసి నటిస్తూ కెరీర్ ను మాంచి స్వింగ్ లో తీసుకెళ్తోంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ వరుస అవకాశాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది.ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్లో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ దూసుకుపోతుంది. అసలు ఖాళీ లేకుండా 24/7 సినిమాల కోసం కష్టపడుతుంది. ఓ పక్క సినిమాలకు కష్టపడుతూనే మరో పక్క డాక్టర్ కోర్స్ కూడా పూర్తి చేస్తుంది. సినిమాల్లో తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. శ్రీలీలకు ప్రస్తుతం ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ వర్క్ కూడా ఉంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా, ఏ ఈవెంట్ చూసినా శ్రీలీల పేరు వినిపిస్తుంది.తాజాగా ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న శ్రీలీల ఆసక్తికర విషయాలు వెల్లడించింది.నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేసి బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.
యంగ్ బ్యూటీ శ్రీలీల మాట్లాడుతూ  'ఓ అతిథిగా వచ్చేంత అర్హత నాకింకా రాలేదనుకుంటున్నా. అందుకే సినిమా కుటుంబంలోని ఓ సభ్యురాలిగా ఇక్కడకు వచ్చా. నితిన్‌ 'మ్యాడ్‌'లో చక్కగా నటించారు. నాకు ఇలాంటి జానర్‌ సినిమాలంటే ఇష్టం. 'గోదావరి' సినిమా చూసినప్పటి నుంచి ఆ ప్రాంతంపై ఇష్టం కలిగింది'' అని శ్రీలీల అన్నారు.  “నితిన్ గారి మ్యాడ్ చిత్రం నాకు చాలా ఇష్టం. ఆయ్ చిత్రంలో హ్యూమర్ చాలా ఉందని అర్థం అవుతోంది. నాకు ఇలాంటి చిత్రాలే చాలా ఇష్టం. అందుకే అనుదీప్ గారెతో నెక్ట్స్ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటాను. గోదావరి ప్రాంతం, ఆ యాస అంటే నాకు చాలా ఇష్టం. ఆగస్ట్ 15న అందరూ అన్ని చిత్రాలను చూడండి” అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: