దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సిని నటుడు ప్రేక్షక అభిమానులు ప్రేమగా విక్టరీ వెంకటేష్ అని పిలుసుకుంటారు. ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు కుమారుడు. వెంకటేష్ 13 dec 1960 ప్రకాశంజిల్లా లోని కారంచేడులో జన్మించారు.శతచిత్రాల నిర్మాత మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు వారసునిగా తెలుగు సినిమాకు పరిచయమయి, ఆనతికాలం లోనే 'విక్టరీ' ని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ ప్రకాశంజిల్లా లోని కారంచేడులో జన్మించారు. వెంకి స్కూల్ చదువు మద్రాస్ లోని ఎగ్మోర్ లో ఉన్న డాన్ బాస్కో స్కూల్ లో సాగింది. మద్రాస్ లోనే లయోలా కాలేజీ నుండి బి.కామ్ లో పట్టబద్రులయ్యారు. తరవాత అమెరికాలోని మోన్టేరీ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్ నేషనల్ స్టడీస్ నుండి యం.బి.ఏ పూర్తి చేసారు. అప్పుడు రామానాయుడుగారు రాఘవేంద్రరావు, హీరో కృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేసారు కానీ ఆఖరి నిమిషంలో కృష్ణ డేట్స్ సర్దుబాటు చేయలేక సినిమా చేయలేను అన్నారు. రాఘవేంద్రరావు డేట్ లు వదులు కోవటం ఇష్టంలేని రామానాయుడి గారు వెంకటేష్ తో సినిమా మొదలు పెట్టారు. అదే 1986లో వచ్చిన కలియుగపాండవులు. ఆ సినిమా ఘనవిజయంతో వెంకటేష్ పేరు ఆంద్రదేశమంతటా మారు మ్రోగటమే కాకుండా తోలిచిత్రంతోనే నంది అవార్డు గెలుచుకుని రికార్డు సృష్టించారు. ఇక అక్కడినుండి 25 సంవత్సరాల కాలంలో 63 చిత్రాలలోనటించారు. నటించిన మొత్తం చిత్రాలలో ఎక్కువ శాతం విజయాలు ఉన్న తెలుగు హీరోగా వెంకి అభినందనీయుడు. అందుకనే 'విక్టరీ' అనేది అయన ఇంటిపేరు అయ్యింది. కెరీర్ తోలినాళ్ళలో యువతను ఆకర్షించిన వెంకి బొబ్బిలిరాజ తో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రేమించుకుందాం..రా..!, పెళ్ళిచేసుకుందాం, కలిసుందాం..రా..! వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం గెలుచుకుని తెలుగు సినిమా మూడో తరం టాప్ నలుగురు హీరోలలో ఒకరిగా నిలిచారు.
వెంకటేష్ తెలుగు లోనే కాకుండా 'ఆనారి', 'తక్ దీర్ వాలా' వంటి చిత్రాలతో హిందీలో కూడా తన ఉనికిని చాటారు. సెంటిమెంట్, యాక్షన్ లను వైవిద్యంగా ప్రదర్శించటం లో వెంకటేష్ ది ఒక ప్రతేక శైలి. తన సమకాలిన నటులలో హాస్యాన్ని సమర్ధవంతంగా పండించగలడు. చాలా సినిమాలలో ఆయన ఫ్యామిలీ హీరో పాత్రలను ధరించారు.లోకం తెలియని పసి హృదయం ఉన్న ‘చంటి’ అయినా.. సవతి తల్లి అయినా కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించే ‘అబ్బాయిగారు’ అయినా.. తండ్రి మాట జవదాటిన బాను ప్రసాద్ (సూర్యవంశం) అయినా.. చెల్లి, తమ్ముళ్లకు కష్టం కాంపౌండ్ దాటకుండా చూసుకునే ‘లక్ష్మీ’ అయినా.. కుటుంబానికి ప్రాధాన్యమిస్తే ప్రతి రోజు ‘సంక్రాంతి’ అని చెప్పాలన్నా.. టాలీవుడ్లో ఒకే ఒక్కడు మన విక్టరీ వెంకటేశ్. కుటుంబ చిత్రాలతో సెంటిమెంట్ పండించాలన్నా.. డీసీపీ రామచంద్రలా విలన్లను రప్ఫాడించాలన్నా.. ఫన్, ఫ్రస్టేషన్ అంటూ ఎఫ్2, ఎఫ్3లో భార్యా బాధితుడిలా కామెడీ పంచాలన్నా వెంకీమామే. టాలీవుడ్లో దాదాపుగా అన్ని జానర్లు టచ్ చేసి ప్రతి జానర్లో హిట్ కొట్టిన హీరో విక్టరీ వెంకటేశ్. సింగిల్ హ్యాండ్ గణేశ్ అంటూ సింగిల్ టేక్లో సీన్స్ అన్నీ చేసేస్తూ.. దాదాపు 38 ఏళ్లుగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. మూవీ మొఘల్ రామా నాయుడు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. సొంత టాలెంట్ తో…తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు వెంకటేశ్. తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచాడు. ఆగష్టు 14 వెంకటేశ్ హీరోగా 38 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. 1986 ఆగష్టు 14న రిలీజైన ‘కలియుగ పాండవులు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.
వెంకటేశ్.. మన అమ్మానాన్నల తరం నుంచి నేటి తరానికీ ఫేవరెట్ హీరో. ఓపూట కుటుంబమంతా కలిసి టీవీ చూడాలంటే టీవీలో వెంకటేశ్ సినిమా రావాల్సిందే. అలా ఫ్యామిలీని ఒకచోట చేర్చి కాసేపు కలిసి సమయం గడిపేలా చేసింది వెంకటేశ్ సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈరోజుకు టీవీలో రాజా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు వస్తే ఛానల్ మార్చకుండా చూస్తున్నారంటే వెంకీకి ఉన్న క్రేజ్ ఏంటో.. ఫ్యామిలీ ఆడియెన్స్పై ఆయన వేసిన ముద్ర ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్నే కాదు. వాసు, ఘర్షణ, నారప్ప, గురు, బాడీగార్డ్, మల్లీశ్వరి, నమో వేంకటేశ, వెంకీమామ ఇలాంటి ఎన్నో సినిమాల ద్వారా యూత్కు బాగా దగ్గరయ్యాడు వెంకటేశ్.అలా 38 ఏళ్లుగా టాలీవుడ్లో ఆయన సినీ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. కలియుగ పాండవులు నుంచి మొన్నటి సైంధవ్ వరకు ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు అయినా.. వెంకీమామను ప్రేక్షకులు అలరిస్తూనే ఉన్నారు. ఆయన కూడా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూనే ఉన్నారు. మరో 30 ఏళ్లు ఆయన ప్రయాణం ఇలాగే కొనసాగాలని.. మనల్ని ఇలాగే ఆయన ఎంటర్టైన్ చేయాలని ఆశిద్దాం. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 38 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్కు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్ అదిరిపోయే సీడీపీ రెడీ చేసింది.ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి 75వ సినిమా సైంధవ్ తో వచ్చారు. మళ్ళీ వచ్చే సంక్రాంతి టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ సినిమా రెడీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది.విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తొలి సినిమా కలియుగ పాండవులు 1986 ఆగస్టు 14న విడుదలైంది.హీరోగా వెంకి నేటికి సరిగ్గా 36 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రస్థానంలో 76 సినిమాలు చేశారు. రెండు సార్లు నంది పురస్కారం, ఐదుసార్లు ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు. ఇదే తరహాలో ఆయన మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ వెంకీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు.