ప్రభాస్‌తో నటించి తప్పు చేశా.. ఇంటర్వ్యూలో ఏడ్చేసిన స్టార్ హీరోయిన్..?
ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అయినందుకు అందులో సీత పాత్ర పోషించిన కృతి సనన్ చాలా బాధపడుతుంది. ఈ సినిమాలో సీత పాత్ర చేసిన కృతి ఆ సినిమా తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అనుకుంది. కానీ, ఈ సినిమా చాలా వరస్ట్ గా ఉందనే టాక్ రావడంతో అది ఫ్లాప్ అయ్యింది. ముఖ్యంగా, ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు చాలా బాగా లేవని, కొన్ని సంభాషణలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ సినిమా గురించి చాలా మంది అవమానకరంగా మాట్లాడారు.
ఆదిపురుష్ సినిమా బాగా ఆడకపోవడంతో కృతి సనన్ చాలా బాధపడిందట. ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా ఎందుకు బాగా ఆడలేదో తెలియలేదని చాలా కష్టపడి పని చేశామని చెబుతూ బోరున ఏడ్చేసింది. ఆ సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించి తప్పు చేశానని అర్థం వచ్చేలాగా ఆమె కామెంట్లు చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ మూవీ తర్వాత తనకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఆదిపురుష్ సినిమా ఏ మతం వారిని అవమానించాలనే ఉద్దేశంతో రాలేదని ఆమె స్పష్టం చేసింది. కానీ, ప్రజలు అలా అనుకోవడంతో చాలా వివాదాలు వచ్చాయి. ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత కృతి తన కుటుంబంతో కలిసి ఈ సినిమా గురించి చాలా నిజాయితీగా డిస్కస్ చేసిందంట. దాని గురించి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం చాలామంది ఇప్పుడు తీశాను అన్నావు ఓదార్చుతున్నారు.