ఎన్టీఆర్ బావమరిదికి రెండో హిట్.. నక్క తోక తొక్కినట్టున్నాడుగా..!!

murali krishna
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘ఆయ్’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజి మణిపుత్ర దర్శకత్వంలో ఆయ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆయ్ సినిమా రేపు ఆగస్టు 16న థియేటర్స్ లోకి వస్తుండగా నేడు ఆగస్టు 15న పైడ్ ప్రీమియర్స్ వేశారు.ఆయ్ కథ కొత్తదేమీ కాదు. కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తది. కొత్త కథలు లేనప్పుడు.. దొరకనప్పుడు ఉన్న కథల్నే.. చాలా కొత్తగా, ఎంటర్టైనింగ్ చెప్పే ప్రయత్నం చేయాలి.. కథను చాలా సింపుల్‌గానూ, ఆసక్తికరంగానూ చెప్పే దర్శకులుంటారు. అనవసరపు బిల్డప్పులు, అనవసరపు ఖర్చులు పెట్టించే దర్శకులు కూడా ఉంటారు. కానీ ఆయ్ దర్శకుడు మాత్రం మొదటి రకానికి చెందిన వాడనిపిస్తుంది.మనం ఎన్నో సార్లు చూసిన కథను, చాలా సింపుల్ కథను.. ఎంతో ఆసక్తికరంగా మలిచాడు. ఆ విషయంలో అంజికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఏ ప్రేమ కథకు అయినా కులం, మతం, స్థాయి అడ్డుగా ఉంటాయి. ఇక గోదావరి జిల్లాల్లో కులానికి ఇచ్చే ప్రాధాన్యతను చాలా ఫన్నీగా చెప్పాడు. ఈ ఆయ్‌లోనూ ఈ కులం గురించే ఉంటుంది. అలా అని ఆ టాపిక్‌ను సీరియస్‌గా ఏమీ హ్యాండిల్ చేయలేదు. ఎంతో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు.

 అందులో సక్సెస్ అయ్యాడు కూడా.మొదటి సినిమాతో పోలిస్తే నార్నె నితిన్ పర్ఫార్మ్ చేసే అవకాశం దక్కింది. అమ్మాయి ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడు. ఇక స్నేహితులుగా నటించిన రాజ్ కుమార్, అంకిత్ తమదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ పరవాలేదు కానీ హీరో పక్కన తేలిపోయేలా అనిపించింది. 
వినోద్ కుమార్, మైమ్ గోపి, సురభి ప్రభావతి, శ్రీవాణి త్రిపురనేని సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. మ్యూజిక్ కూడా చాలా క్యూట్ అనిపించేలా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు కూడా సినిమా కథకు తగ్గట్టుగా స్కోర్ చేశారు. నిర్మాణం విలువలు గీత ఆర్ట్స్ స్థాయికి తగ్గట్టే ఉన్నాయి.సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. గోదావరి ఊళ్ళల్లో తీయడం, ఎక్కువ షూట్ వర్షాకాలంలో తీయడంతో విజువల్స్ ఇంకా బాగున్నాయి. లొకేషన్స్ కూడా చాలా ఆహ్లాదకరమైన లొకేషన్స్ పట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా, కామెడీగా ఉంది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ బాగున్నాయి. దర్శకుడిగా అంజి ఒక రెగ్యులర్ కథని, సీరియస్ సబ్జెక్టుని తీసుకొని కామెడీగా మంచి కథనంతో రాసుకొని చాలా బాగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఆయ్’ సినిమా ఓ ముగ్గురు ఫ్రెండ్స్ చేసే అల్లరి, ప్రేమలో క్యాస్ట్ ప్రాబ్లమ్ ని కామెడీగా చూపించి నవ్వించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.ఆయ్ మూవీ కథ పాతదే అయిన డైరెక్టర్ ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. హీరో నాని నితిన్ నటన గోదావరి ఆశ కడుపుబ్బించే కామెడీ పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.సెకండ్ హాఫ్ లో కొన్ని సాగదీత సీన్లు ఉన్నా క్లైమాక్స్ భావోద్వేగం గా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. గోదావరి ఊళ్ళల్లో తీయడం, ఎక్కువ షూట్ వర్షాకాలంలో తీయడంతో విజువల్స్ ఇంకా బాగున్నాయి. లొకేషన్స్ కూడా చాలా ఆహ్లాదకరమైన లొకేషన్స్ పట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా, కామెడీగా ఉంది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ బాగున్నాయి. దర్శకుడిగా అంజి ఒక రెగ్యులర్ కథని, సీరియస్ సబ్జెక్టుని తీసుకొని కామెడీగా మంచి కథనంతో రాసుకొని చాలా బాగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టారు.మొత్తంగా ‘ఆయ్’ సినిమా ఓ ముగ్గురు ఫ్రెండ్స్ చేసే అల్లరి, ప్రేమలో క్యాస్ట్ ప్రాబ్లమ్ ని కామెడీగా చూపించి నవ్వించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: