వావ్: తెలుగు నటులలో రామ్ చరణ్ కి అరుదైన గౌరవం..!

Divya
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ పేరు సంపాదించారు. రామ్ చరణ్ ఇంతకు ముందు యంగ్ మెగాస్టార్ నుంచి.. గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్నారు.RRR కు ఏదైతే ఆస్కార్ అవార్డు లభించింద అప్పటి నుంచి ఎదుగుతున్నారు. రామ్ చరణ్ ఇటీవలె ఆస్ట్రేలియా కి చేరుకున్నారు.. మెల్బోర్డు నగరంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్టులో అభిమానులు కూడా భారీగానే తరలివచ్చినట్లు తెలుస్తోంది. మెల్బోర్డులో ఆగస్టు 15 నుంచి 25 వరకు జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మేల్ బోర్డులో IFFM చలనచిత్రోత్సవానికి రామ్ చరణ్ గౌరవ అతిదిగా పిలిచారట.

IFFM 17వ ఉత్సవానికి హాజరుకావాలని ఇటీవల ఫీలింగ్ ఫెస్టివల్ నిర్వాహకులు రామ్ చరణ్ కు సైతం ఆహ్వానాన్ని పంపించారట. ఈ చలనచిత్ర ఉత్సవంలో రాంచరణ్ కి నిర్వాహకులు ఇండియన్ ఆర్ట్ కల్చర్ అంబాసిడర్ అనే బిరుదును కూడా ఇవ్వబోతున్నారట. తద్వారా భారతదేశంలో ఎక్స్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో తెలుగు నటులలో ఇలాంటి అరుదైన గౌరవం లభించినటువంటి నటుడిగా ఏకైక నటుడుగా పేరు పొందుతారు రామ్ చరణ్ అని తెలుస్తోంది. ఇప్పటిదాకా కూడా అలాంటి ఒక పురస్కారాన్ని గౌరవాన్ని సైతం రామ్ చరణ్ అందుకోబోతున్నారు.

ఈ విషయం తెలిసి అభిమానులైతే ఫుల్ ఖుషి గా ఉన్నారు.  రామ్ చరణ్ చిత్రాల విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు కూడా కొంతమేరకు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అయిపోగానే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC -16 సినిమాని చేయబోతున్నారు ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్నది. rrr చిత్రం తర్వాత మరే సినిమాని కూడా విడుదల చేయలేదు రామ్ చరణ్. దీంతో అభిమానులు కాస్త నిరాశతో ఉన్నప్పటికీ గేమ్ చేంజర్ సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: