బాహుబలిలో శ్రీదేవి నటించకపోవడం వెనుక ఆ బడ నిర్మాతల హస్తం ఉందా..?

Divya
తెలుగు సినిమా ఖ్యాతిని ఒక లెవెల్ కి తీసుకువెళ్లిన చిత్రం ఏదైనా ఉందంటే అది బాహుబలి సినిమా అనే చెప్పవచ్చు. ఈ సినిమా తెరకెక్కించిన తీరు కథ అందరిని ఆకట్టుకున్నా ఈ ముఖ్యంగా విజువల్స్ ఎఫెక్ట్ కూడా ఈ సినిమా సక్సెస్ కు కారణమయ్యింది. ఈ చిత్రం డైరెక్టర్ రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ అందుకున్నారు. ప్రభాస్ ,అనుష్క, రమ్యకృష్ణ, రానా, తమన్నా వంటి వారు ఇందులో అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ శివగామి పాత్రలో అద్భుతంగా నటించేసిందని చెప్పవచ్చు. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కి కూడా ఇక్కడే బీజం పడింది.

అయితే మొదట ఈ క్యారెక్టర్ కి సైతం రమ్యకృష్ణ అని అనుకోలేదట రాజమౌళి.. అతిలోక సుందరి శ్రీదేవిని ఈ క్యారెక్టర్ కోసం తీసుకోవాలని రాజమౌళి అనుకున్నారట. శ్రీదేవి వల్ల అటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనే కాకుండా ఇతర మార్కెట్లో కూడా మంచి గుర్తింపు వస్తుందని భావించిన రాజమౌళి.. ఈ పాత్ర కోసం ఆమె అడగమని నిర్మాతలకు చెప్పగా ఆమె ఎనిమిది కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని తన ఖర్చులన్నీ కూడా భరించాలని చెప్పేసిందట. ఈ విషయాన్ని నిర్మాతలు సైతం రాజమౌళికి చెప్పడంతో బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుందని రాజమౌళి ఆలోచించి పక్కన పెట్టేసామని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని తెలియజేశారు.

అయితే ఈ మాటలు విన్న తర్వాత నటి శ్రీదేవి కూడా రిప్లై ఇచ్చిందట..అన్ని డబ్బులు అసలు తను అడగలేదని నిర్మాతలు రాజమౌళికి అబద్దం చెప్పి ఉంటారనే విధంగా ఆమె వెల్లడించింది.. డబ్బుల కోసమే నటించేదాన్ని అయితే 300 సినిమాలు నటించగలనా అంటూ లాజిక్ గా కూడా తెలియజేసిందట శ్రీదేవి. బాహుబలి చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రొడ్యూస్ చేయడం జరిగింది.. ఒకవేళ రాజమౌళి అనుకున్నట్లు శ్రీదేవిని తీసుకొని ఉంటే శివగామి పాత్రకి ఆమె పెద్దగా సూట్ అయ్యేది కాదేమో అని రమ్యకృష్ణ నటన చూస్తే అర్థమవుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: