వారి ఆశలన్నీ దేవర మూవీపైనే..తారక్ మూవీ కోసం థియేటర్స్ వెయిటింగ్
మహేష్ బాబు గుంటూరు కారం వచ్చినా అంతగా ఆడలేదు. ఆ తర్వాత మొన్న ప్రభాస్ కల్కి వచ్చింది. అలాగే మధ్యలో వచ్చి హనుమాన్ మూవీ మంచి టాక్‌తో క్రౌడ్ పుల్లర్ చిత్రంగా నిలిచింది. అలాగే కల్కి వల్ల భారీగా ప్రేక్షకులు సినిమా థియేటర్స్‌కి వచ్చారు. దీంతో తెలుగుతో పాటుగా హిందీలో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. తాజాగా రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ, రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే క్రౌడ్ ఎంత వరకూ వస్తుందనేది తెలియాల్సి ఉంది. దీంతో ఇప్పుడు అందరూ దేవర మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించేది దేవర మూవీనే అని నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత నార్త్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి మంచి క్రేజ్ పెరిగింది.
తారక్ ఇటు తెలుగుతో పాటు అటు హిందీలో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇక టీజర్, ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటాయనే విషయం ఇప్పటికే అర్థం అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్‌తో ఆచార్య మూవీ చేసిన తర్వాత ఇప్పుడు దేవర చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ మూవీపైనే నమ్మకం పెంచుకున్నారు. అయితే దేవర మూవీ ఏ మేరకు ఈ ఏడాది క్రౌడ్ పుల్లర్‌గా నిలుస్తుందనేది వేచి చూడాల్సిందే.