ఎన్నో అంచనాల మధ్య మాస్ మహారాజ రవితేజ , హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . హిందీలో సూపర్ హిట్ అయిన అజయ్ దేవ్‌గణ్ ‘రైడ్’ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేశారు. ఈ సినిమాతో మరాఠి ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. ‘ఈగల్’ వంటి హిట్ చిత్రం తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. 2019లో వరుణ్ తేజ్‌తో చేసిన ‘గద్దలకొండ గణేశ్’ వంటి హిట్ చిత్రం అనంతరం దాదాపు ఆరేండ్ల తర్వాత హరీశ్ శంకర్ చేస్తున్న మూవీ అవడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి.
అయితే భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాలు ఫస్ట్ డే ఎంతమేర కలెక్ట్ చేసాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫస్ట్ షో నుంచి మిక్స్ టాక్ అందుకుంది ఈ చిత్రం. కొందరేమో సినిమా సూపర్ అంటుంటే.. మరికొందరేమో అస్సలు బాగాలేదని.. దర్శకుడు హరీశ్ శంకర్ మార్క్ ఎక్కడా కనిపించలేదని చెప్పుకొస్తున్నారు. ఇక దీని కలెక్షన్ల విషయానికొస్తే.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల మధ్య కలెక్షన్‌ను నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చి ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా
వేస్తున్నారు. ఇది పర్వాలేదు అని అనిపించే ఓపెనింగ్ అనుకుంటే పెద్ద పొరపాటు. మొదటి రోజు 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న ఈ సినిమా కేవలం 6 కోట్ల రూపాయిల దగ్గరే ఆగిపోయింది. ఇక రెండవ రోజు వసూళ్లు నూన్ షోస్ చాలా దారుణంగా ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే ఈ వీకెండ్ తర్వాత ఈ చిత్రానికి ఒక్క రూపాయి షేర్ వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. దీంతో సోషల్ మీడియా లో నెటిజెన్స్ కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతైనా ఈ చిత్రాన్ని రాబడుతుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు...!!