ఆశలు వదులుకున్న నాగ్ ఫ్యాన్స్... దానితో సరి పెట్టుకోవాల్సిందేనా..?

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను నాగార్జున సంక్రాంతి కి చాలా తక్కువ రోజుల ముందు మొదలుపెట్టాడు అలాగే ఈ సినిమాను సంక్రాంతి కి తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. దానితో చాలా మంది ఈ సినిమా షూటింగ్ స్టార్టింగ్ కి సంక్రాంతి కి చాలా తక్కువ రోజులు ఉండడంతో ఈ మూవీ దాదాపుగా సంక్రాంతి కి రాదు అని ఫిక్స్ అయ్యారు. కానీ నాగార్జున మాత్రం ఈ మూవీ షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేసి సంక్రాంతి కి తీసుకురావడం మాత్రమే కాకుండా దానితో మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు.


ఇకపోతే ఇప్పటికే సంక్రాంతి పూర్తి అయ్యి చాలా కాలం అవుతుంది. ఇప్పటి వరకు నాగార్జున తన తదుపరి మూవీ ని స్టార్ట్ చేయలేదు. అలాగే తాను ఏ సినిమా చేయబోతున్నాడు , ఎవరితో మూవీ చేయబోతున్నాడు అనే అప్డేట్ కూడా ఏమీ లేదు. ఇన్ని రోజుల పాటు నాగార్జున అభిమానులు నా సామి రంగ సినిమా మాదిరి గానే నాగ్ మరో మూవీ ని స్టార్ట్ చేసి చాలా తొందరగా ఈ మూవీ ని పూర్తి చేసి దానిని వచ్చే సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు అని భావించారు. అందుకు తగినట్లే వార్తలు కూడా రావడంతో వారు ఎంతో ఖుషి అయ్యారు. ఇకపోతే ఇప్పటి వరకు నాగార్జున ఏ సినిమాను స్టార్ట్ చేయలేదు.


అలాగే ఎలాంటి అప్డేట్ నాగార్జున నెక్స్ట్ మూవీ కి సంబంధించి రావడం లేదు. దానితో నాగార్జున వచ్చే సంక్రాంతి కి సినిమాతో రావడం కష్టంగానే కనబడుతుంది. ఇకపోతే నాగార్జున మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ గా 8 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక సినిమా కాకపోయినా నాగార్జున వారానికి రెండు రోజులు బుల్లి తెరపై కనిపిస్తాడు కాబట్టి వాటితోనే నాగర్జున అభిమానులు సరిపెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: