' బ్రహ్మ ఆనందం ' లో బ్రహ్మానందం.. లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!!

murali krishna
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ కలిసి ఓ సినిమా చేయబోతున్న విష‌యం తెలిసిందే. ‘బ్రహ్మ ఆనందం’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించనున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జ‌రుపుకుంటుడ‌గా.. మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇక ఈ ఫ‌స్ట్ లుక్‌లో బ్రహ్మానందం పంచెక‌ట్టులో సాంప్ర‌దాయ లుక్‌లో అల‌రిస్తున్నాడు.బ్ర‌హ్మీ అంటే మ‌హ‌దానందం. ఆయ‌న‌ను చూస్తేనే అంద‌రికీ ఆనందం. అభిమానుల‌కు ఎన‌లేని ఆనందాన్నిచ్చే మేటి న‌టుడు. అత‌డిపై ఫ్యాన్స్ కు అంతులేని ప్రేమాభిమానాలు. 1987లో అహ‌నా పెళ్లంట సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన బ్ర‌హ్మానందం ఆ త‌ర్వాత ఇంతింతై అన్న చందంగా ఎదిగి, నేడు ఇంత‌టి సంచ‌ల‌నంగా మార‌తాడ‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. బ్ర‌హ్మానందం ఏజ్ లెస్ స్టార్ అన‌డానికి తాజాగా విడుద‌లైన ఈ పోస్ట‌ర్ ఒక ఎగ్జాంపుల్.చ‌క్క‌ని వ్యంగ్యం చ‌తుర‌త‌, కామెడీ ఇవ‌న్నీ ఈ పాత్ర‌ల్లో క‌నిపిస్తాయి. బ్రహ్మానందం ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఆయ‌న‌లో కామిక్ టైమింగ్ ఎక్క‌డా మిస్ కాలేదు.

ఈ పోస్ట‌ర్ లో బ్ర‌హ్మీ ఎంతో ట్రెడిష‌న‌ల్ గా పంచెక‌ట్టులో క‌నిపించారు. సంక్రాంతి అల్లుడులా జెరీ అంచు సిల్కు చొక్కా తొడుక్కుని షేడ్స్ ధ‌రించి ఎంతో స్టైలిష్ గా క‌నిపించాడు. తెల్ల పంచె గోల్డ్ చొక్కా అద్భుతంగా కుదిరాయి. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అతను ఇంట్లోకి రాజాలా ప్ర‌వేశిస్తున్న‌ట్టు కనిపిస్తోంది.మ‌రోసారి బ్ర‌హ్మీలోని కామిక్ కోణాన్ని ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నారు. పోస్ట‌ర్ ఆస‌క్తిని పెంచింది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఆర్‌విఎస్ నిఖిల్ దర్శకత్వంలో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ (బ్రహ్మానందం – రాజా గౌతమ్‌) ఆన్ స్క్రీన్‌లో తాతామనవళ్లుగా నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. వెన్నెల కిషోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మితేష్‌ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిసపాటి, ఆర్ట్‌: క్రాంతి ప్రియం, రచన-దర్శకత్వం: ఆర్‌వీఎస్‌ నిఖిల్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: