ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.
ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు 44.86 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా 38.88 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ 9.25 కోట్ల కలెక్షన్లతో 3వ స్థానంలోనూ నిలిచాయి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని 7.97 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే 4 వ స్థానంలో నిలిచింది.
తమిళ డబ్బింగ్ సినిమా భారతీయుడు 2 మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.75 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఆగస్టు 15 వ తేదీన రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఇస్మార్ట్ సినిమా విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు 6.10 కోట్ల కలెక్షన్లతో 6 వ స్థానంలో నిలవగా , ఇదే రోజు విడుదల అయిన మిస్టర్ బచ్చన్ సినిమా 4.56 కోట్ల కలెక్షన్లతో 7 వ స్థానంలో నిలిచింది. రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగాఎం సినిమా 4.30 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలోనూ , రవితేజ హీరోగా రూపొందిన ఈగల్ సినిమా 3.93 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలోనూ , విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ 3.85 కోట్ల కలెక్షన్లతో 10 వ స్థానంలో నిలిచాయి.