చాలామంది నటీ నటులు ఇండస్ట్రీకి రాకముందు ఎంతో దుర్భర స్థితిని అనుభవించిన వాళ్ళు ఉంటారు. అలా స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఇండస్ట్రీకి రాకముందు డబ్బుల కోసం ఎన్నో పనులు చేశారు.ఇక అలాంటి వారిలో ఈ నటుడు కూడా ఉన్నారు. డబ్బుల కోసం ఒకప్పుడు ఆయన వాటర్ క్యాన్లు సప్లై చేసేవారట. కానీ కట్ చేస్తే..దేశం గర్వించదగ్గ డైరెక్టర్ కం హీరో అయ్యారు.ఈయన తన నటనతో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా అందుకున్నారు. మరి ఇంతకీ ఆయన ఎవరో మీకు ఇప్పటికే గుర్తొచ్చి ఉంటుంది..ఆయన ఎవరో కాదు కాంతారా సినిమాతో దేశంలోనే గొప్ప పేరుగాంచిన నటుడు దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి.. రిషబ్ శెట్టి సినిమాల్లోకి రాకముందు చిన్నతనం నుండే సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నాడట. కానీ ఇంట్లో వాళ్లకు సినిమాలకు వెళ్లడం ఇష్టం లేదట.
అయితే మొదట ఈయన డైరెక్టర్ అవ్వాలనుకుని డైరెక్టర్ కోచింగ్ తీసుకోవాలి అని ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సులో జాయిన్ అయ్యారట.అయితే ఈ విషయం తెలిసిన రిషబ్ శెట్టి తండ్రి మందలించి నీకు డబ్బులు కూడా ఇవ్వను అని చెప్పారట. డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళ అక్క ఇచ్చిన కొద్ది డబ్బులతో రిషబ్ శెట్టి మినరల్ ప్లాంట్ వ్యాపారం పెట్టి రాత్రంతా వాటర్ క్యాన్స్ సప్లై చేసేవారట.అలా కొద్ది రోజులు చేసాక ఓ రోజు ఓ కన్నడ నిర్మాతని ఓ క్లబ్లో కలిసి అవకాశం అడగగా ఆయన దర్శకత్వం వహించబోయే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా రిషబ్ శెట్టి ని తీసుకున్నారు. అలా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా రిషబ్ శెట్టి చేస్తున్న సమయంలో ఆయనకు రోజుకి 50 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేవారు.
ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు అప్పుచేసి హోటల్ బిజినెస్ పెట్టారట.కానీ అది సక్సెస్ అవ్వకపోవడంతో అప్పులు ఎక్కువై అప్పుల వారికి కనిపించకుండా మారు వేశాలు వేసుకొని తిరిగే వారట. అలా డబ్బు కోసం రిషబ్ శెట్టి ఎన్నో ఇబ్బందుల్లో పడి చివరికి మళ్లీ సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు.ఇక ఈయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు కాంతారా సినిమాలో నటుడిగా చేసి నటనతో బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక త్వరలోనే కాంతారా 2 సినిమా కూడా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి గురించి ఈ విషయాలు తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.