అయ్యో: టాప్ డైరెక్టర్లతో సినిమా చేసిన..స్టార్ హీరో కాలేకపోయినా నటుడు..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అంటే చాలా మంది ఎక్కువగా బ్యాగ్రౌండ్ ఉన్న వారు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. నటీనటుల కుమారులు కుమార్తెలు, ముఖ్యంగా దర్శకుల కొడుకులు, నిర్మాతల కొడుకులు ఇలా ఎంతోమంది కూడా టాప్ డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేసి సక్సెస్ కాలేకపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరో నితిన్ కూడా ఒకరు. తన సినీ కెరియర్ ప్రారంభంలో టాప్ దర్శకులతో సినిమాలు చేసిన స్టార్ హీరోగా పేరు సంపాదించుకోలేకపోయారు నితిన్.

తన మొదటి సినిమా జయం సినిమా కు డైరెక్షన్ చేసిన తేజ అప్పట్లో టాప్ డైరెక్టర్.. ఆ వెంటనే డైరెక్టర్ రాఘవేంద్రరావుతో అల్లరి బుల్లోడు తీసిన ఫ్లాప్ గా మిగిలింది.. డైరెక్టర్ వివి వినాయక్ నితిన్ తో కలిసి దిల్ సినిమాని చేశారు. డైరెక్టర్ రాజమౌళితో సై సినిమా చేశారు నితిన్. డైరెక్టర్ పూరీతో హార్ట్ ఎటాక్, కృష్ణవంశీ తో శ్రీ ఆంజనేయం త్రివిక్రమ్ తో ఆ ఆ.. ఇలా ఎంతోమంది టాప్ దర్శకులతో చేసినప్పటికీ కూడా తన కెరియర్ మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటికీ కూడా తన కెరియర్ లో ఒడిదుడుకులను సైతం ఎదుర్కొంటూనే ఉంటున్నారు.

ఒక్క సినిమా సక్సెస్ అయ్యింది అంటే నాలుగు సినిమాలు ఫ్లాప్ అవుతున్నట్లుగా నితిన్ కెరియర్ ప్రస్తుతం కొనసాగుతోంది. చివరిగా నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో అభిమానులు సైతం నాసిరకం డైరెక్టర్లతో సినిమాలు తీయడం వల్లే తన మార్కెట్ కూడా పడిపోతుందనే విధంగా తెలుపుతున్నారు. ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్కుని కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మరొక డైరెక్టర్ వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. మరి ఇవైనా నితిన్ కెరియర్ ని మలుపు తిప్పుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: