థియేటర్స్ కు ప్రేక్షకులు రాకపోవడానికి కారణం అదే.. బన్నీ వాసు కామెంట్స్ వైరల్..!!

murali krishna
టాలీవుడ్‌లో సినిమా మనుగడ గురించి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సినిమా థియేటర్‌కు ప్రేక్షకులు రాకుండా తామే చెడగొట్టామని తాజాగా ఆయన కామెంట్‌ చేశారు.ప్రస్తుతం వ్యాఖ్యలు  హాట్‌ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత బన్ని వాస్‌ స్పందించారు.ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే... ప్రేక్షకుడిని థియేటర్‌కి తీసుకు రావడమే ఓ పెద్ద సవాల్‌. నాలుగు వారాల్లో ఓటీటీల్లోకి సినిమా తీసుకొస్తాం, మీరు ఇంట్లోనే కూర్చోండని మేమే ప్రేక్షకుల్ని చెడగొట్టాం'' అన్నారు.కదా దీనిపై మేరేమంటారు అని ప్రశ్నించగా, ''ఎవరెన్ని బాధలు పడినా, ఏం చేసినా చిత్ర పరిశ్రమలో ఐక్యత లేకపోతే ఏమీ చేయలేం. ఛాంబర్‌, లేదా ఇంకెవరైనా రూల్స్‌ పెడితే, ఇది సక్సెస్‌ అయ్యేది కాదు. ఎగ్జిబిటర్స్‌, ప్రొడ్యూసర్స్‌ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే, థియేటర్లు ఇవ్వమని బాలీవుడ్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలను ఇక్కడా అమలు చేయాలి'' అని అన్నారు.

ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే తప్పకుండా ఏదైనా సందర్భం ఉండాలని బన్నీ వాసు అన్నారు. రీసెంట్‌గా మహేశ్ బాబు పుట్టినరోజు కారణం వల్ల 'మురారి'కి భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. అలా ప్రేక్షకుల్లో ఒక మూడ్‌ క్రియేట్‌ అయితేనే థియేటర్‌కు వస్తారు. తమ 'ఆయ్‌' మూవీకి భారీగా పబ్లిసిటీ చేసినప్పటికీ సాధారణ రోజుల్లో విడుదల చేస్తే ఉపయోగం ఉండేది కాదు. కేవలం 25శాతం లోపే ఓపెనింగ్‌ వచ్చేది. కానీ, ఆగష్టు 15 నుంచి వరుస సెలవులు ఉండటం వల్ల సినిమాకు అడ్వాంటేజ్‌ దక్కింది. అందుకే ఆయ్‌ సినిమాకు 45 శాతం ఓపెనింగ్ జరిగిందని బన్నీ వాసు పేర్కొన్నారు. కలెక్షన్ల పరంగా కూడా తమకు గ్రాస్‌ మాత్రమే కనపడుతుంది కానీ, షేర్‌ కనిపించడంలేదని ఆయన అన్నారు. గతంలో మాదిరి థియేటర్‌లలో పరిస్థితిలు ఇప్పుడు లేవని బన్నీ వాసు అన్నారు.అలా కాకుండా మౌత్‌ టాక్‌తో వెళ్తే మూడో వారానికి అందుకుంటుంది. అందులో నాకు 35శాతం, మల్టీప్లెక్స్‌ వాళ్లకు 65శాతం వెళ్లుంది. గ్రాస్‌ కనపడుతుంది తప్ప, కానీ షేర్‌ కనపడదు. ఇది వరకు ఉన్నట్లు థియేటర్లలో పరిస్థితులు అనుకూలంగా లేవు'' అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: