బెస్ట్ హర్రర్ మూవీ డిమోంటే కాలనీ -2 ..తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే..?

Divya
చాలా మంది ప్రేక్షకులు ఎక్కువగా హర్రర్ సినిమాలు అంటే లైక్ చేస్తున్నారు. కేవలం హర్రర్ సినిమాలు, మహాభారతానికి సంబంధించిన చిత్రాలు, దైవ చిత్రాలు మాత్రమే చూస్తున్నారు. అది చిన్న సినిమా అయినా స్టార్ హీరోల సినిమా అయినా సరే హర్రర్ సినిమా అంటే కచ్చితంగా హిట్ అయ్యేలా ప్రేక్షకులు చేస్తున్నారు. అలా తమిళంలో గతంలో డీమాంటే కాలనీ అనే సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ కొన్నేళ్ళకు ఇప్పుడు తాజాగా డిమాంటే కాలనీ-2 సినిమా విడుదలై తమిళంలో మంచి బ్రేక్ ని అందుకుంది. వారి అంచనాల మధ్య ఆగస్టు 15న తమిళ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా విడుదల అయింది.

అన్ని చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటుగా కలెక్షన్స్ కు కూడా బాగానే సంపాదించుకుంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. వారికి తాజాగా ఒక గుడ్ న్యూస్ ని తెలియజేసింది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని ఆగస్టు 23న తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇందులో అరుల్ నిధి, ప్రియా భవాని శంకర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. తమిళంలో తంగలాన్  వంటి సినిమాతో పోటీపడి మరి ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతోందట.

ఈ చిత్రానికి అజయ్ ఆర్ జ్ఞానముతో దర్శకత్వం వహించారు. రాజు వర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా భయపెట్టేలా ఉన్నది. ఇప్పుడు తాజాగా రిలీజ్ తేదీని కూడా అనౌన్స్మెంట్ చేయడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. హర్రర్ మూవీస్ లో బెస్ట్ హర్రర్ మూవీ చిత్రంగా డీమాంటే కాలనీ -2 పేరు సంపాదించుకుంటోంది. మరి ఏ విధంగా మరొకసారి ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: