ఓ పక్క ఏపీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. వీలు దొరికినప్పుడల్లా.. సినిమాలు చేయడానికి ట్రై చేస్తానంటూ ఇప్పటికే చెప్పారు. ఇక ఇప్పుడు షూటింగ్‌లకు కూడా వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక దీన్నే కన్ఫర్మ్ చేస్తూ.. తాజాగా హరిహర వీరమల్లు టీం నుంచి ఓ బిగ్ న్యూస్ బయటికి వచ్చింది. 400 నుంచి 500 మందితో మొదలయ్యే భారీ యాక్షన్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోనున్నట్టు మేకర్స్ నుంచి అఫీషియల్ ఇన్ఫో అందింది. ఇదే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూనే పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. హరిహరవీరమల్లు షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. భారీ యుద్ధ సన్నివేశాలను
తెరకెక్కిస్తున్నారు.. పవన్ కల్యాన్ ఈ సినిమా లో శక్తిమంతమైన యోధుడిగా కనిపిస్తారు. ఈ షెడ్యూల్‌లో వచ్చే దృశ్యాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని అంటున్నారు మేకర్స్. ఇప్పుడు తెరకెక్కిస్తున్న షెడ్యూల్‌తో హరిహరవీరమల్లుకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తవుతుంది. ఈ ఏడాదిలో ఎలాగైనా మూవీని విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్. ఓటీటీ డీల్ కూడా అలాగే ఉండటంతో, ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందు ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవర్‌స్టార్. హరిహరవీరమల్లు తర్వాత ఓజీ సెట్స్ కి వెళ్లాలన్నది పవర్‌స్టార్ ప్లాన్. హరిహరవీరమల్లు లుక్ నుంచి ఓజీ
లుక్‌కి మేకోవర్ అవుతారు. ఓజీ బావుంటుంది.. చూద్దురుగానీ అని పవన్ అన్న మాటలు ఇంకా తమ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయని అంటున్నారు అభిమానులు. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో ఒకదాని రిలీజ్ డేట్ ప్రకటన ఉంటుందేమోనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ఫ్యా న్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. టీజర్లు లేదా పోస్టర్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ చివరి దశలో తప్ప విడుదల తేదీలు లాక్ చేసుకునే పరిస్థితి లేదు..!!