తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఉంటారు. వీరిద్దరూ చాలా సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఫుల్ జోష్ లో కెరియర్ ను కొనసాగిస్తూ ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికి కూడా అద్భుతమైన రీతిలో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం వీరు చేస్తున్న కొన్ని పనుల వల్ల వీరి అభిమానులకు టెన్షన్ పుడుతుంది. అదేమిటి అనుకుంటున్నారా. బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో N B K 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.
ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గానే జరుగుతున్న ఇప్పటికే ఈ మూవీ నుండి మూవీ బృందం వారు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ ను గాని , విడుదల తేదీని గాని అనౌన్స్ చేయలేదు. దానితో ఈ మూవీ టైటిల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో ... ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందా అని బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నా సామి రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఈ మూవీ తర్వాత ఈయన ఇప్పటి వరకు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాగే పలానా బ్యానర్ లో కానీ , ఫలానా దర్శకుడితో కానీ సినిమా చేయబోతున్నట్లు ఎలాంటి అప్డేట్ బయటకు రావడం లేదు. దానితో ఈయన అభిమానులు అసలు నాగార్జున ఏం ప్లాన్ చేస్తున్నాడు. ఎలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు నా సామి రంగ సినిమా విడుదల అవునా వేరే మూవీ ని ఓకే చేయడం లేదా అని టెన్షన్ లో ఉన్నారు.