ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. డార్లింగ్ రీ రిలీస్.. డేట్ కూడా వచ్చేసింది..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ప్రభాస్ కి సరికొత్త లవర్ బాయ్ ఈమేజ్ దక్కింది. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు.
 


తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 23 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఈ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరు భారీగా పెరిగిన విషయం మన అందరికీ తెలిసిందే.


అందులో భాగంగా చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతున్నాయి. మరి డార్లింగ్ సినిమా రీ రిలీజ్ ల భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. ఇక కొన్ని రోజుల క్రితమే మురారి సినిమా రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. మరి ఈ సినిమా మురారి మూవీ రీ రిలీస్ పాత రికార్డులను చెరిపి వేసి కొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా రీ రిలీస్ కోసం ఎంతో మంది ప్రభాస్ అభిమానులు చాలాన్కాలంగా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: