హీరో విజయ్ లుక్స్ పై విమర్శలు..డైరెక్టర్ రియాక్షన్ అదుర్స్..!
విజయ్ గోట్ సినిమాలో డి ఏజెంట్ లుక్కు పైన విమర్శలు వస్తున్నాయని అడగగా.. అలాగే స్పార్క్ సాంగ్ లోని విజయ్ డాన్స్ విషయంలో ట్రోల్స్ పైన స్పందించారు.. ముందుగా విజయ్ లుక్ పైన ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాము. అలాగే విజయ్ సర్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నామని ఆయన కూడా మంచి సలహా ఇచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రంలో చాలా మార్పులు చేశామని తెలిపారు డైరెక్టర్ వెంకట ప్రభు. అలాగే ట్రైలర్లో చూసిన లుక్కే ఫైనల్ అనీ ఈ లుక్ నే సినిమాలో చూస్తారు.. ఇలా నేర్చుకోవడం మాకు ఒక గుణపాఠం లాంటిది అంటూ తెలిపారు వెంకట ప్రభు.
ఇక సాంగ్స్ విషయంలో మిక్స్డ్ టాక్ వచ్చిందని.. అలాగే డాన్స్ విషయంలో కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తాయని ముఖ్యంగా విజువల్ ట్రీట్ అందరిని ఆకట్టుకుంటుంది అంటూ తెలిపారు వెంకట ప్రభు. గోట్ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా అని అందుకోసమే డి ఏజింగ్ టెక్నాలజీతో ఉపయోగించి విజయ్ ని యంగ్‌గా చూపించే ప్రయత్నం చేశామని.. వీటితోపాటు మరో గెటప్ లో కూడా ఆయన సందడి చేయబోతున్నారని తెలిపారు.. విజయ్ కి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో స్నేహ, లైలా ,ప్రభుదేవా, ప్రశాంత్ తదితరునటీనటులు నాటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. కోలీవుడ్ లో ఉండే ప్రతి థియేటర్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని ఒకవేళ ఇలా జరిగితే ఈ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఏకైక సినిమా ఇదే అంటూ తెలిపారు.