ఇండస్ట్రీలో మకుటం లేని యువరాజు.. రూ.2900 కోట్లకు అధిపతి.. ఈ హీరో తెలుసా..
రూ.2,900 కోట్ల ఆస్తి అతనికి ఉంది. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న అతి కొద్ది మంది హీరోలలో ఒకడు. రొమాంటిక్ సినిమాలతో పాటు యాక్షన్ సినిమాలు కూడా తీస్తుంటాడు. బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించడం అతనికి కొత్త ఏం కాదు. ఇప్పటికీ 58 ఏళ్ల వయసు వచ్చిన సరే యువకుడు లాగానే కనిపిస్తున్నాడు అదిరిపోయే యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. ఆయన స్టీల్ బ్యాచిలర్ కావడం విశేషం.
బాలీవుడ్ కింగ్ త్రయంలో ఇతను ఒకడు. ఆయనెవరో ఇప్పటికే మీకు ఐడియా వచ్చే ఉంటుంది రెడీ మరెవరో కాదు రెడీ, దబాంగ్ లాంటి హిట్స్ అందుకున్న సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ 1988లో ‘బివి హో తో ఇసి’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. మైనే ప్యార్ కియా (1989) మూవీతో తొలిసారి హీరోగా వెండి తెరపై మెరిసాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది దాని తర్వాత అతను దబాంగ్, ఏక్ థా టైగర్, హమ్ దిల్ దే చుకే సనమ్, తేరే నామ్, టైగర్ జిందా హై, బజరంగీ బైజాన్, సుల్తాన్, కిక్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. సల్మాన్ బాలీవుడ్ ప్రముఖ రచయిత సలీం ఖాన్, సుశీలా చరక్ దంపతులకు జన్మించాడు.