మెగా అభిమానుల అందరి చూపులు ఆ మూవీ పైనే.. అంచనాలు అందుకుంటే ఆ స్టార్ హీరోలకు కష్టమే..?

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ల ట్రెండ్ భారీగా పెరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా శాతం వరకు ఏదైనా స్టార్ హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆ హీరోకు సంబంధించిన బ్లాక్ బాస్టర్ మూవీ లను రీ రిలీజ్ చేస్తున్నారు. అలా రీ రిలీజ్ అయిన సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉండడంతో ఈ ట్రెండ్ తెలుగులో భారీగా పెరిగిపోయింది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర అనే బ్లాక్ బాస్టర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ... బి గోపాల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు. ఆ సమయంలో ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన రీ రిలీస్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేశారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ టికెట్ బుకింగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇక ఈ వారం విడుదల అయిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తూ ఉండకపోవడంతో అది ఇంద్ర సినిమా రీ రిలీస్ కు బాగా కలిసి వస్తే అంశంగా కనబడుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా ఇంద్ర సినిమా ఏ స్థాయి రికార్డులను నెలకొల్పుతుందో చూడాలి. ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఎన్నో సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. మరి ఇంద్ర మూవీ కూడా ఆ స్థాయి ఇంపాక్ట్ ను రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: