వినాయక చవితి సందర్భంగా ఆ మూడు సినిమాలు.. తెలుగు మూవీల సందడి ఎక్కువ లేనట్లే..?
ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మొదటగా సెప్టెంబర్ 5 వ తేదీన తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా గోట్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీనే తెలుగు లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు ఉన్నాయి.
సుహాస్ హీరో గా రూపొందిన జనక అయితే గనక సినిమా ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన భలే ఉన్నాడే సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద స్థాయి అంచనాలు లేవు.
ఇలా ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోయే సినిమాలలో తెలుగు నుండి రెండు చిన్న సినిమాలు ఉన్నాయి. ఇక తమిళ డబ్బింగ్ సినిమా అయినటువంటి గోట్ మూవీ పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద స్థాయి అంచనాలు లేవు.