మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత మళ్లీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ మూవీ గురించి నిత్యం ఓ రూమర్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.అదేమిటంటే అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ 'ఓఆర్ఎంఏఎక్స్' ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ తర్వాత విడుదలయ్యే, ట్రైలర్ రిలీజ్ కానీ సినిమాలపై సమస్త సర్వే చేసింది. ఇందులో ఎన్టీఆర్ నటిస్తున్న "దేవర" సినిమా కోసం ఎక్కువ మంది ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో పుష్పా2, ఓజి, స్పిరిట్,జై హనుమాన్ సినిమాలు ఉన్నాయి.ఈవిషయం తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంటున్నారు.
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న మూడవ సినిమా ఇది. దీంతో దేవర కోసం తారక్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటుండగా.. ఇందులో గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది జాన్వీ. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను షేర్ చేయనున్నారు మేకర్స్.ఇదిలా ఉంటే.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుండగా.. ఆతర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సముద్ర నేపథ్యంలో మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. ఇక ఇందులో యాక్షన్స్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని.. అందుకు హాలీవుడ్ తోపాటు బాలీవుడ్ యాక్షన్ మాస్టర్లను పెట్టి షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ను దాదాపు రూ. 33 కోట్లకు టీ సిరీస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అధికారికంగా ధ్రువికరించాల్సి ఉంది.