రేవ్ పార్టీ పై నటి హేమ సంచలన పోస్ట్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిందిగా..!
టెస్ట్ చేయడంతో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ జరిగిందనే విధంగా వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన విచారణ కోరుతూ.. నోటీసులు పంపడంతో విచారణ కోసం అరెస్టు చేసి కొద్ది రోజులపాటు హేమ ను జైల్లో కూడా ఉంచడం జరిగింది. ఆ తరువాతే హేమ బయటికి వచ్చినప్పటి నుంచి చాలామంది దారుణంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ కూడా హేమ పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తాను తప్పు చేయలేదని విషయాన్ని నిరంతరం చెబుతూ వార్తలు లో నిలుస్తూనే ఉన్నది.
తాజాగా హేమ తన ఇంస్టాగ్రామ్ నుంచీ ఒక సంచలన వీడియోని సైతం షేర్ చేసింది.. అందరికీ నమస్కారం నేను మీ హేమను గత కొన్ని నెలలుగా తనపైన వస్తున్న వార్తల వాళ్ల తాను సంపాదించుకున్న 30 ఏళ్ల పేరును పరువును భూస్థాపితం చేశారు..అయితే తాను కూడా కొన్ని టెస్టులు చేయించుకున్నానని తన జుట్టుతో పాటు గోర్లు బ్లడ్ ఇలా అన్నీ కూడా చెక్ చేయించాను తనకు నెగటివ్ రిపోర్టు వచ్చిందని తెలియజేసింది. ఇది ఆల్రెడీ కొన్ని చానల్స్ కి పంపించడం కూడా జరిగింది అంటూ తెలిపింది హేమ. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే తాను ఎలాంటి టెస్టుకైనా బహిరంగంగా సిద్ధంగానే ఉన్నాననీ చొప్పడానికి వచ్చానని తెలిపింది హేమ. అలాగే కొంతమంది అపాయింట్మెంట్ కావాలని కూడా తెలుపుతోంది.