దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ పై సాయి సౌజన్య సహా నిర్మాతగా వ్యవహరిస్తుండగా….’శ్రీకర ప్రొడక్షన్స్’ సంస్థ సమర్పిస్తుంది. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ చిత్రం మరోసారి సరికొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఆ తర్వాత, సెప్టెంబర్ 7 కి ప్రీ పోన్ చేస్తూ అధికారిక ప్రకటన చేశారు. తాజాగా మరోసారి రిలీజ్ డేట్ గురించి కొత్తగా ప్రకటన చేశారు.
ఈ చిత్రాన్ని అక్టోబర్ 31, 2024 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. విడుదలలను వాయిదా వేయడం సోషల్ మీడియా ప్రతిష్టపై ప్రభావం చూపుతుంది, కానీ మా సినిమా నాణ్యతకు ఇది చాలా అవసరం. లక్కీ భాస్కర్ ప్రపంచ వ్యాప్తంగా ఈ దీపావళికి థియేటర్ల లోకి రానుంది అని పేర్కొన్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. 80-90 లలో ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీతో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య నిర్మించారు.శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమా వాయిదా వేస్తున్నట్లు తాజాగా సినిమా యూనిట్ ప్రకటించింది. ప్రతి భాషలో అక్కడి లోకల్ ఫ్లేవర్ రావడం కోసం డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నామని, ఇప్పటికిప్పుడు కంగారుగా సినిమాను తీసుకురావడం కంటే దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన రిలీజ్ చేయడం మంచిదని అప్పటికి వాయిదా వేశామని ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పాట అలాగే టీజర్ సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఆ అంచనాలను ఆధారంగా చేసుకుని మరింత పర్ఫెక్ట్ గా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది.