తలైవా " వెట్టయన్ " నుంచి రాకింగ్ ఆంథమ్..!!

murali krishna
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్‌. జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్‌, రితికా సింగ్‌ మేల్‌ లీడ్ రోల్స్‌ లో నటిస్తుండ గా.. ఫహద్ ఫాసిల్ , మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌ డైరెక్టర్‌.ఎస్ ఆర్ కథిర్ ఈ సినిమాకు డిఓపిగా పని చేయ గా ఇమ్మన్, అనిరుధ్, జోసెఫ్ విజయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తం గా ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నట్లు సినిమా టీమ్ వెల్లడించడం జరిగింది. దీనితో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.రజినీకాంత్ మరోవైపు తలైవా 171గా తెరకెక్కుతున్న కూలి చిత్రంలో కూడా నటిస్తున్నాడు.కాగా వెట్టైయాన్ నుంచి ఎగ్జైటింగ్‌ న్యూస్ షేర్ చేశాడు అనిరుధ్‌. వెట్టైయాన్ నుంచి సాంగ్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్టు పోస్ట్ చేశాడు అనిరుధ్‌. ఇప్పటికే షూట్‌ టైం లో సూపర్ స్టార్లు అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌, ఫహద్ ఫాసిల్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన స్టిల్‌ నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ముగ్గురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెట్టైయాన్‌ నుంచి ఫహద్ ఫాసిల్ కాలేజ్‌ స్టూడెంట్‌లా బ్యాగ్‌ వేసుకొని హాయ్‌ చెప్తున్నట్టు ఉన్న పోస్టర్‌ సినిమా పై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇదిలావుండ గా వెట్టయన్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. సినిమాలోని మనసిలాయో సాంగ్ విడుదల అవనుందని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పేర్కొన్నారు.తలైవా హార్డ్ కోర్ ఫ్యాన్ అనిరుద్ నుంచి మరో రాకింగ్ ఆంథమ్ లోడ్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో హుకుం సాంగ్ రాబోతుందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: