నాగచైతన్య-శోభిత పెళ్లికి ముహుర్తం ఫిక్స్‌..ఎక్కడంటే?

Veldandi Saikiran
గత కొన్ని సంవత్సరాల నుంచి నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉండి కుటుంబ సభ్యులను ఒప్పించి ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. నాగచైతన్య, సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు చైతు. సీక్రెట్ గా వీరి ప్రేమను కొనసాగించారు. కొన్నిసార్లు కెమెరా కంట పడినప్పటికీ వీరి ప్రేమ వార్తలపై వారిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఇక రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. వీరి ఎంగేజ్మెంట్ ని నాగచైతన్య ఇంట్లోనే చాలా ప్రైవసీగా జరుపుకున్నారు. వీరి వివాహం త్వరలోనే జరగనుంది.

అయితే చైతు, శోభిత ఎంగేజ్మెంట్ చాలా తక్కువ మందితో జరిపించినప్పటికీ వివాహాన్ని మాత్రం చాలా గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నారట. వివాహం చేయడానికి చైతు, శోభిత కుటుంబ సభ్యులు వేదిక వెతుకుతున్నారట. వీరి వివాహాన్ని రాజస్థాన్, మధ్యప్రదేశ్ లేదా విదేశాల్లో జరిపించాలని అనుకుంటున్నారట. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. వీరి ఎంగేజ్మెంట్ ఆగస్టు 8వ తేదీన జరిపించిన నాగార్జున.... పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని చెప్పారు.

ఇక నాగచైతన్య, శోభిత ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందినవారే. ఇద్దరూ కూడా హీరో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఇంతవరకు ఏ సినిమాలోను నటించలేదు. మరి వీరిద్దరికీ ఎలా పరిచయం ఏర్పడింది అనే ప్రశ్నలు చాలామందికి వచ్చాయి. అయితే నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాతనే చైతు శోభితకు కనెక్ట్ అయ్యారట. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నాగచైతన్యకు, శోభితకు మధ్య పరిచయం ఏర్పడిందట. ఓ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో వీరిద్దరూ కలిసినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి పరిచ యం ఏర్ప డింది. అతితక్కువ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: