పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పొలిటికల్ గా చాలావరకు బిజీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన చేయాల్సిన మూడు సినిమాలు సగభాగం షూటింగ్ జరుపుకుని తదుపరి షెడ్యూల్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం సుజీత్ తో ఓజి, జ్యోతి కృష్ణ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు పవన్.ఈ మూడింటి పై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక వీటిలో పాన్ ఇండియన్ మూవీ ఓజి గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇదిలావుండగా రాజకీయాలా? సినిమాలా? అంటే పవన్ కళ్యాణ్ కచ్చితంగా… ‘రాజకీయాలే అని’ చెబుతారు. ప్రజాసేవ కోసమే ఆయన నిలబడ్డారు. ఎన్నికల హడావిడి వల్ల.. సినిమాలను సైతం పవన్ పక్కన పెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ పవన్ ని సినిమాలపై కూడా దృష్టి పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో ‘ ‘ఓజీ’ కంప్లీట్ చేస్తాను..చూద్దురుగాని.. బాగుంటుంది’ అని స్వయంగా పవన్ హామీ ఇచ్చారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. గ్లింప్స్ కూడా అదిరిపోయింది. అయితే ఓజీ అప్డేట్ లేక ఫ్యాన్స్ డల్ అయిపోయారు. అయితే ఈరోజు నాని దయవల్ల ‘ఓజీ’ అప్డేట్ వచ్చింది. అదెలా అంటే..
ప్రముఖ నిర్మాత డివివి దానయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ చెప్పారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డివివి దానయ్య మాట్లాడారు.‘సరిపోదా శనివారం’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా అలరిస్తుందని.. ఈ సినిమాతో నాని బాక్సాఫీస్ దగ్గర మరో సెన్సేషనల్ హిట్ కొడుతున్నాడని దానయ్య అన్నారు. ఈ సందర్భంగా నాని పవన్ కళ్యాణ్ ‘ఓజి’ గురించి అప్డేట్ చెప్పాల్సిందిగా కోరారు. దీంతో ‘ఓజి’ చిత్ర షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతుందని.. రిలీజ్ కూడా త్వరలోనే ఉంటుందని దానయ్య తెలిపారు.దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘సరిపోదా శనివారం’ మూవీలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా, జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు.