ఆయనతో డాన్స్ నచ్చేది కాదు.. మెగాస్టార్ డాన్స్ పై సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమా ఇంద్ర . ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. తెలుగు ఇండస్ట్రీలో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. బీ గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ గా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా చూస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ టికెట్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. ఇక ఇంద్ర సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం సినిమాకే హైలైట్..
 ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీలో మెగాస్టార్ యాక్షన్ ప్రేక్షకులకు పిచ్చెక్కించింది. ఈ మూవీ డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు బీ గోపాల్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ ఇంద్ర సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో 2002 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా చిరంజీవి నంది పురస్కారం అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ గా ఆగస్టు 22న రీ రిలీజ్ చేయనున్నారు.
 

తాజాగా ఈ మూవీ రీరిలీజ్‌పై సోనాలి బింద్రే మాట్లాడారు. ఇంద్ర మూవీ చిత్రీకరణ రోజులను గుర్తు చేసుకున్నారు."వైజయంతీ సంస్థలో పని చేయడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది. అశ్వినీదత్‌ ఎంతో మంచి వ్యక్తి. అలాగే చిరంజీవితో కలిసి నటించడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంద్ర సినిమాలో అన్నిటి కన్నా కష్టమైన పని ఆయనతో కలిసి డ్యాన్స్లు వేయడమే. ఆయనతో సమానంగా డ్యాన్స్‌ చేయడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి.దాయి దాయి దామ్మా సాంగ్ షూటింగ్ ఉందని నాతో చెప్పారు. ఆ భయంతో రాత్రి అంతా నిద్రే పట్టలేదు. ఆ సాంగ్లో చిరు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఆయన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. నన్ను కూడా వీణ స్టెప్‌ వేయమంటారని చాలా భయపడ్డాను. రాధే గోవిందా, ప్రేమే కుట్టిందా సాంగ్ చిత్రీకరణలో బాగా ఎంజాయ్‌ చేశాం. హైదరాబాద్‌లోని పెద్ద సెట్‌లో ఆ పాటను షూట్ చేశారు. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ అంతా అప్పుడు సెట్‌లోనే ఉన్నారు. 'ఇంద్ర'ను మళ్లీ వెండి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చిరంజీవి ఫ్యాన్స్కు ఇది పండగ రోజు" అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు.ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సోషియో ఫాంటసీ 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ట దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: