బలగం వేణు తో సినిమా అందుకే కుదరలేదు.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన నాని..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని హీరోగా బలగం మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఓ మూవీ ని రూపొందించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ఓ వార్త వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆ తర్వాత వేణు , నాని కి ఓ కథను వివరించగా  ఆ కథ ఆయన గతంలో చేసిన దసరా మూవీ కి దగ్గరగా ఉండడంతో నాని ఆ మూవీ ని రిజెక్ట్ చేశాడు అని ఓ వార్త వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "సరిపోదా శనివారం" అనే సినిమాలో హీరో గా నటించాడు.

ఈ మూవీ ని ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా నాని పాత్రికేయలతో ముచ్చటించాడు. అందులో భాగంగా ఈయనకు దిల్ రాజు బ్యానర్ లో బలగం వేణు దర్శకత్వంలో మీరు హీరోగా ఓ మూవీ ఉంటుంది అని వార్తలు వచ్చాయి. అది ఎంత వరకు వాస్తవం అనే ప్రశ్న నాని కి ఎదురైంది. దీనికి నాని సమాధానం చెబుతూ ... నేను , వేణు దర్శకత్వంలో సినిమా కమిట్ కాలేదు. కాకపోతే ఒక రోజు దిల్ రాజు నన్ను ఎలాంటి దర్శకులతో సినిమా చేయాలి అనుకుంటున్నావు అని అడిగాడు. దానితో బలగం వేణు లాంటి డైరెక్టర్ తో సినిమాలు చేయాలి అని ఉంది అని అన్నాను.

ఇక ఆ తర్వాత ఆ వార్త అటు తిరిగి ఇటు తిరిగి బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఎలా బయటకు వచ్చిందో నాకు కూడా తెలియదు కాకపోతే బలగం సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అలాగే వేణు దర్శకత్వం అన్నా నాకు ఎంతో ఇష్టం. మరి కొంత కాలం లోనే వేణు దర్శకత్వం లో నేను హీరో గా దిల్ రాజు గారి బ్యానర్ లో కచ్చితంగా ఒక సినిమా ఉంటుంది అని నాని తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే నాని హీరో గా రూపొందిన సరిపోదా శనివారం సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో నాని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: