మెగాస్టార్ బర్త్ డే.. విశ్వంభర క్రేజీ అప్డేట్ వైరల్..!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిష కృష్ణన్ హీరోయిన్ గా, ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ ఫాంటసీ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఓ అప్ డేట్ వినిపిస్తోంది. వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ షూటింగ్ ను టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ సెట్‌ ను కూడా వేసినట్లు తెలుస్తోంది.  ఈ సాంగ్ లో మెగాస్టార్ మ్యూజికల్ స్టెప్స్ తో పాటు చిరు త్రిషల లవ్ ట్రాక్ని కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తారని తెలుస్తోంది.
కాగా ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలావుండగా మెగాస్టార్ బర్త్ డే వేడుకలు మొదలైపోయాయి. ఆగష్టు 22 అర్ధరాత్రి నుంచే మెగా అభిమానులు కోలాహలంగా చిరు పుట్టిన రోజు వేడుకలను కేక్ కటింగ్స్ తో సెలెబ్రేట్ చేసుకుంటానికి సిద్దమైపోతారు. అటు మెగాస్టార్ ఫ్యామిలీతో సహా తిరుమలకు బయలుదేరారు. రేపు గురువారం చిరు పుట్టిన రోజు స్పెషల్ గా విఐపి బ్రేక్ దర్శనంలో చిరు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు.ఇక మెగా ఫ్యాన్స్ కేక్ కటింగ్స్, రక్త దానాలతో బాస్ కి విష్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.
అయితే చిరు లేటెస్ట్ మూవీ విశ్వంభర నుంచి ఎలాంటి ట్రీట్, ఎప్పుడు రాబోతుంది అనే విషయంలో మెగా సస్పెన్స్ లో నడుస్తుంది. వసిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర నుంచి టీజర్ రాబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. కానీ మేకర్స్ నుంచి అప్ డేట్ లేదు. ఏ సమయానికి టీజర్ వదులుతారనే విషయంలో మెగా ఫ్యాన్స్ లో గందరగోళం మొదలైంది. బాస్ బర్త్ డే కి ఎలాంటి హడావిడి ఉండాలి, టీజర్ అప్ డేట్, పోస్టర్ అప్ డేట్ అంటూ హంగామా చెయ్యాల్సింది పోయి ఇంత సైలెంట్ గా ఉంటే ఎలా అంటూ మెగా ఫ్యాన్స్ సీరియస్  అవుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది..నేడు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఇవాళ తెల్లవారుజామున విశ్వంభర సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు డైరెక్టర్ వశిష్ఠ.ఈ పోస్టర్ చూస్తుంటే.. ఒక పెద్ద కొండ లోపల ఏదో కొత్త ప్రపంచంలోకి చిరంజీవి వెళ్తున్నట్టు ఉంది. ఇక ఈ పోస్టర్ ని షేర్ చేసి మెగాస్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి ఇవాళ ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విశ్వంభర సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రానుంది అని పోస్ట్ చేసారు. దీంతో మెగా అభిమానులు విశ్వంభర అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: