HBD chiranjeevi: చిరంజీవికి మాత్రమే సాధ్యమైన రికార్డ్స్ ఇవే..!
చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. వాటిని తట్టుకోలేక మళ్ళీ రాజకీయాల నుంచి బయటికి వచ్చి ఖైదీ-150 చిత్రంతో రియంట్రీ ఇచ్చారు. దాదాపుగా మెగాస్టార్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 46 ఏళ్ల సినీ ప్రస్తానమని చెప్పవచ్చు. చిరంజీవి అందుకున్న రికార్డ్స్ ఏమిటంటే.
1).1999-2000 సంవత్సరంలో అత్యధికంగా పన్ను చెల్లించిన హీరోగా సన్మాన అవార్డుని అందుకున్నారట.
2). చిరంజీవి నటించిన స్వయంకృషి చిత్రం రష్యన్ లోకి డబ్బింగ్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే.
3). చిరంజీవి బావగారు బాగున్నారా సినిమా కోసం 240 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేశారు.. ఈ సన్నివేశాన్ని సినిమా అయిపోయిన తర్వాత కూడా చూపిస్తారు.
4). చిరంజీవి చేసిన హీరోగ చేసిన చిత్రాలు వంద రోజులు ఆడినవి చాలానే ఉన్నాయి.
5). ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషకం అందుకున్న మొదటి భారతీయుడుగా పేరుపొందారు మొదటిసారి కోటి రూపాయలు 1992లో అందుకున్నారట.
6). ఘరానా మొగుడు రూ .10 కోట్ల రూపాయలు రాబట్టిన మొట్టమొదటి చిత్రం గా చిరంజీవికి అందుకుంది.
7). తనకంటూ ఒక పర్సనల్ వెబ్సైట్ ని కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయ హీరోగా మాత్రమే చిరంజీవికి ఇది సొంతం.