సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటించడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే చిన్న సినిమాలలో నటించిన అవి అద్భుతమైన విజయం సాధిస్తేనే వాటి ద్వారా మంచి గుర్తింపు వస్తుంది. అదే స్టార్ హీరోల సినిమాలలో నటిస్తే అవి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా వాటి ద్వారా మంచి ఈమేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానితో చాలా మంది నటీమణులు చిన్న సినిమాలలో నటించడం కంటే కూడా స్టార్ హీరోల సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించే భాగ్య శ్రీ బోర్స్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
ఆగస్టు 15 వ తేదీన నార్నీ నితిన్ హీరోగా రూపొందిన ఆయ్ అనే మూవీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో భాగ్య శ్రీ నే మొదట హీరోయిన్గా అనుకున్నారట. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ ఆ తర్వాత రవితేజ సినిమాలో ఆఫర్ రావడంతో ఈ బ్యూటీ ఆయ్ సినిమాను వదిలేసి మిస్టర్ బచ్చన్ సినిమా వైపు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఇలా భాగ్య శ్రీ ఆయ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ని వదిలేసి మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించినట్లు ఈ మధ్య అనేక కథనలు బయటకు వస్తున్నాయి.