24 సంవత్సరాల తర్వాత మళ్లీ టాలీవుడ్ లో అలాంటి టఫ్ ఫైట్..?

MADDIBOINA AJAY KUMAR
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం ఆ సమయంలో ప్రేక్షకులు సినిమాలను చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడంతో ఆ టైంలోనే స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానితో అనేక సినిమాలు ఆ సమయంలో విడుదల కావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీసుల దగ్గర సందడి వాతావరణం నెలకొంటుంది. ఇకపోతే 2001 వ సంవత్సరం టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలో విడుదల అయ్యాయి.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ చాలా హీట్ గా మొదలు అయింది. కానీ ఇందులో మృగరాజు సినిమా ఫ్లాప్ గా నిలవగా , దేవిపుత్రుడు యావరేజ్ విజయాన్ని అందుకోగా , నరసింహ నాయుడు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని , ఆ సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతికి కూడా 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర కనబడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయాలి అని ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే కానీ జరిగితే 24 సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురు హీరోలు సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర తలబడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: