చిరంజీవికి ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
ఇప్పటికీ సీనియర్ హీరోగా టాప్ ప్లేస్ లో ఉన్న ఆయన నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ అయితే వారం ముందు నుంచే చిరు బర్త్ డే సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. కాగా తెలుగు పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా.. ఓ హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి కు చాలా ఇష్టమట. అతనే తన ఫేవరేట్ యాక్టర్ అని మెగాస్టార్ చిరంజీవి కొన్ని సందర్భాల్లో చిరు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి ఫేవరేట్ హీరో మరెవరో కాదు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తారక్ నటన అంటే చిరుకు ఎంతో ఇష్టం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాను చిరు ఎన్నోసార్లు స్వయంగా చూశారు. ఆ సినిమాలో తారక్ యాక్షన్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమాలోని కోర్టు సన్నివేశంలో తారక్ నటనకు అందరినుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ సన్నివేశం కోసం టెంపర్ సినిమాను తాను ఎన్నోసార్లు చూసినట్లు చిరంజీవి చెప్పారు. కాగా మెగాస్టార్ ఫ్యామిలీతో ఎన్టీఆర్ కు మంచి బాండింగ్ ఉంది. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ లతో తారక్ ఎంతో సన్నిహితంగా ఉంటాడు. ఇప్పటికే రామ్ చరణ్ తో కలిసి 'RRR' సినిమాలో నటించాడు. ఈ సినిమాతో వీరి మధ్య బంధం మరింత బలపడింది.