సాయి పల్లవిని టార్చర్ పెడుతుంది ఎవరు.. అసలేమైందంటే..?
పాత్రలకు ప్రాముఖ్యత ఉంటేనే చేస్తుంది. దీనికి తోడు రికమండేషన్ ఉన్నా , హీరో నామినేషన్ ఉన్న సినిమాలు చేయదు. అందుకే స్టార్ హీరోలు, సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా, కథ నచ్చకపోతే సినిమాలు రిజెక్ట్ చేసేస్తుంది సాయి పల్లవి. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ కెరియర్లో దూసుకుపోతున్న ఈమె, ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో చేస్తోంది. ఇందులో సీతగా కనిపించబోతోంది సాయి పల్లవి. సీత పాత్ర అయితే చేస్తోంది కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అంటూ అడుగుతున్నారు. ముఖ్యంగా సాయిపల్లవిని పెళ్లి చేసుకోమని ఒకరు టార్చర్ చేశారట. ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన విషయాలను కూడా బయటపెట్టింది.
సాయి పల్లవి మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో మా తల్లిదండ్రులు నన్ను బాగా టార్చర్ చేశారు
కజిన్ సిస్టర్స్ అందరికీ పెళ్లయిపోవడం ,, నేను ఇంకా పెళ్లి కాకుండా కరోనా నుంచి ఇంట్లో ఉండడంతో అప్పటినుంచి నాకు పెళ్లి టార్చర్ మొదలయ్యింది. నా కెరియర్ లో నేను అనుకున్నది ఇంకా ఏం సాధించలేదు ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకుంటాను అని తల్లిదండ్రులతో చెప్పిందట. తల్లిదండ్రుల టార్చర్ భరించలేక కరోనా లాక్ డౌన్ ఎప్పుడు అయిపోతుంది.. తిరిగి సినిమాలలోకి ఎప్పుడు వెళ్తాను అంటూ తెగ మదన పడిపోయిందట సాయి పల్లవి.