తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.గత ఏడాది విడుదల అయిన ది కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా భారీగా గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అదా శర్మకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే రీసెంట్ గా పెటా ఇండియాకు చేసిన యాడ్ క్యాంపైన్ లో భాగంగా మీడియాతో ఆమె ఇంటరాక్ట్ అవుతూ తను శాఖాహారిని అనే విషయం గుర్తు చేస్తూ మాంసాహారులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది.అదాశర్మ చిన్నప్పటినుంచి శాఖాహారి. ఆమె తరుచుగా తన అభిమానులను మాంసం తినవద్దని రిక్వెస్ట్ చేస్తూంటుంది. అయితే ఆమెకు మానవుడు ప్రారంభం రోజుల్లో వేటాడుతూ మాంసాహారి అని చెప్తూ ఫుడ్ చెయిన్ ని గుర్తు చేస్తూ అలాంటి వాళ్ళు ఇప్పుడు మాంసం మానేసి నాన్ వెజిటేరియన్ గా ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దానికి అదా శర్మ సమాధానమిస్తూ... మీరు చెప్పింది వంద శాతం నిజం. అయితే మీరు ఆ స్టోన్ ఏజ్ రోజుల్లో ఉండి గుహల్లో నివసిస్తూ, అప్పటి ఆయుధాలతో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా వేడాతుతూ మీ ఇష్టం వచ్చిన జంతువును వేడాడి తినచ్చు. దాన్ని పచ్చిగానో లేక కాల్చుకునో తినచ్చు. అయితే ఇప్పుడు కూడా మాంసం తినాలంటే ఆ నాటి కాలం లోగా గుహల్లో ఉంటూ వేటాడుతూ తినండి. అంతేకానీ ఏసీ కారుల్లో, ఏసీ రెస్టారెంట్ లలో కూర్చుని చక్కగా జంతువుని కోసి, చర్మం తీసేసి , రోస్ట్ చేసి , ప్లేట్ లలో పెట్టుకుని తినకూడదు అని చెప్పుకొచ్చింది. అదా శర్మ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.