అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ పెళ్లిలో నిజంగానే అంత పెద్ద రచ్చ జరిగిందా..జాన్వీ కపూర్ పెళ్లికి వచ్చి అభిషేక్ బచ్చన్ కి మొదటి భార్యను నేనే అంటూ రచ్చ రచ్చ చేసిందా.. ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటే చేయి కూడా కోసుకొని సూసైడ్ చేసుకోవాలని చూసిందా.. ఇన్ని రోజులు ఈ విషయం ఎక్కడా బయటపడలేదే అని చాలామంది షాక్ అవుతూ ఉంటారు. మరి ఇంతకీ ఇందులో ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లయి దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది.అయితే వీరి పెళ్లిలో అప్పట్లో ఓ వివాదం చోటు చేసుకుందట. అదేంటంటే.. జాన్వీ కపూర్ అభిషేక్ బచ్చన్ పెళ్లికి వచ్చి ఆయన మొదటి భార్య నేనే..నన్ను ఆయన పెళ్లి చేసుకుని వదిలేసారు అంటూ సంచలన ఆరోపణలు చేసిందట.
అంతే కాదు కేసు కూడా పెట్టిందట.కానీ ఈ కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు కొట్టేశారు.ఇక జాన్వీ కపూర్ అంటే అందరూ శ్రీదేవి కూతురు హీరోయిన్ జాన్వీ కపూర్ అని అనుకుంటారు. కానీ ఆ జాన్వీ కపూర్ వేరే ఈ జాన్వి కపూర్ వేరే.. అభిషేక్ బచ్చన్ తో మోడల్ జాన్వి కపూర్ తనని అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నాడని తప్పుడు మాటలు మాట్లాడింది. అంతేకాదు ఓ రోజు అభిషేక్ బచ్చన్ ఇంటి ముందు ధర్నా కూడా చేసిందట.అంతేకాకుండా ఐశ్వర్య అభిషేక్ లో పెళ్లిరోజు వచ్చి మణికట్టు కోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసిందట.
దాంతో పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్లాక ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక పోలీసులు కేసు ఫైల్ చేసి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారట. ఆ తర్వాత జాన్వి కపూర్ ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ఇంటివైపు కూడా చూడలేదట. వారి జీవితంలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వలేదట.అలా ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి సమయంలో పెద్ద రచ్చ జరిగింది. అయితే అభిషేక్ బచ్చన్ తో కలిసి జాన్వీ కపూర్ ఓ సినిమాలో నటించిందట.