సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నితిన్ హీరోయిన్..?
ఇక ఆమె ఎవరో కాదు నితిన్ తో లై మూవీలో నటించిన హీరోయిన్ మేఘా ఆకాష్.. ఛల్ మోహన్ రంగా, లై,రాజరాజ చోర, రావణాసుర, గుర్తుందా శీతాకాలం, డియర్ మేఘ వంటి తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ చివరగా తెలుగులో రావణాసుర మూవీలో కనిపించింది. అయితే గత కొద్ది రోజులుగా అవకాశాలు లేకపోవడంతో ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంది.అయితే తాజాగా ఈ హీరొయిన్ కి సంబంధించి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక గత కొద్ది రోజులుగా ఈ హీరోయిన్ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతుందని, రాజకీయ నాయకుడి కొడుకుని పెళ్లి చేసుకోబోతుందని రూమర్స్ వినిపించినప్పటికీ అవన్నీ తోసిబుచ్చుతూ సాయి విష్ణు అనే అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోస్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ హీరోయిన్ తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. అయితే మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోయే సాయి విష్ణు ఎవరు ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనేది మాత్రం ఇంకా బయటపడలేదు.